Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీనేజీ పిల్లలు... పెద్దలు చెప్పిన మాట ఓ పట్టాన వినరు. స్వేచ్ఛగా ఆలోచించాలి అనుకుంటారు. సొంతంగా పనులు చేయాలనుకుంటారు. వారిని అర్థం చేసుకోవాలంటే తల్లిదండ్రులు ఈ సూచనలు పాటిస్తే సరి.
బాల్యంలో అమ్మానాన్నలు చెప్పినట్లు నడుచుకొనే పిల్లల ప్రవర్తన యుక్తవయసులోకి వచ్చేసరికి మారడం మొదలవుతుంది. అయితే వయసుతోపాటు వారి ఆలోచనలూ.. మారతాయని గ్రహించాలి. పరిసరాలు, స్నేహితులకు ప్రభావితమై సొంతంగా ఆలోచిస్తుంటారు. ఇదేమీ తప్పు కాదు. కొన్ని విషయాల్లో వారి మాటలకు, అభిప్రాయాలకు విలువ ఇచ్చి చూడండి. కచ్చితంగా వారి తీరులో మార్పు వస్తుంది.
పాటించాలి..హొహొఏ విషయాన్నైనా పదే పదే చెబితే టీనేజీ పిల్లలకుహొహొనచ్చకపోవచ్చు. వారికేదైనా చెబుతుంటే...దాన్ని ముందు పెద్దవాళ్లు పాటించినప్పుడే వారూ అనుసరిస్తారు. తల్లిదండ్రులను స్ఫూర్తిగా తీసుకుంటారు.
వాదనలొద్దు.. మన పిల్లలే కదా.. కోప్పడొచ్చని తల్లిదండ్రులు భావించకూడదు. వారితో మాట్లాడేటప్పుడు గొంతును వీలైనంత తక్కువ స్థాయిలో ఉంచి మృదువుగా మాట్లాడాలి. ఈ వయసు పిల్లలు తమ అభిప్రాయాలను అమ్మానాన్నలకు గట్టిగా అరిచి చెప్పాలనుకుంటారు. దానికి రియాక్ట్ అయితే చివరకు ఇరువురిమధ్య సంభాషణ వాదనగానే మిగులుతుంది. ఆ అవకాశం ఇవ్వొద్దు.