Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రంగు పోయే దుస్తుల్ని ఇతర దుస్తులతో కలిపి నానబెట్టినప్పుడు లేదంటే వాషింగ్ మెషీన్లో ఉతికేటప్పుడు వాటి రంగు మిగతా వాటికి అంటుకోవడం సహజం. ముఖ్యంగా తెలుపు రంగు దుస్తుల విషయంలో ఎక్కువగా ఇలా జరుగుతుంటుంది. అయితే ఎంత ఉతికినా ఈ రంగు ఓ పట్టాన వదలదు. ఇలాంటప్పుడు ఒక చిన్న తెల్ల గుడ్డ ముక్క తీసుకొని.. దానిపై హెయిర్ స్ప్రే, రబ్బింగ్ ఆల్కహాల్ లేదంటే 90 శాతం ఆల్కహాల్ ఉన్న ఏదైనా ద్రావణం పోసి.. దాంతో మరక పడ్డ చోట పదే పదే తుడుస్తుండాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా మరక వదిలిపోతుంది. ఆపై దీన్ని సాధారణంగా ఉతికి ఆరేస్తే సరిపోతుంది.