Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వయం ఉపాధి ఉమెన్స్ అసోసియేషన్ (సేవా)... ఇది ఒక మహిళల సమూహం. స్థానిక మహిళా సంఘాలకు లింగ అసమానతలపై అవగాహన కల్పించేందుకు... సమానత్వానికై పోరాడేందుకు కావల్సిన సహాయ సహకారాలు అందిస్తుంది. ముఖ్యంగా ఇండ్లల్లో పని చేసే గృహకార్మికులకు జాతీయ స్థాయిలో సమాన వేతనాలు కల్పించాలని, కార్మిక హక్కులు వర్తింప చేయాలని కృషి చేస్తుంది.
37 ఏండ్ల ఖుష్బూ గుప్తా... 2020లో సంభవించిన కరోనా లాక్డౌన్ల కారణంగా ఆమె భర్త ప్లాస్టిక్ బ్యాగ్‌లను విక్రయించే వ్యాపారాన్ని ఆపివేయవలసి వచ్చింది. ఆ సమయంలో ముగ్గురు పిల్లల తల్లిగా ఉన్న గుప్తా భారత దేశంలోని కోట్లాది మంది స్త్రీలలో ఒకరు. కుటుంబాన్ని పోషించుకోవడానికి గృహ ఆధారిత, గృహనిర్మాణ, వీధి వ్యాపార పనిలోకి వెళ్లింది.
సామాజిక భద్రత
గుప్తాకు స్వయం ఉపాధి ఉమెన్స్ అసోసియేషన్ (SEWA) నుండి సహాయం అందింది. 2020లో ఆమె చేరిన ఆ సంస్థ అప్పటికే 21 లక్షల మంది మహిళలను స్వయం ఉపాధి కల్పించింది. నేడు ూజుఔA మద్దతుతో ఆమె సొంత కుట్టుమిషన్ కొనుక్కుంది. రోజుకు ఎనిమిది గంటలు పని చేస్తుంది. నెలకు రూ. 3500-4000 సంపాదిస్తుంది. ఇప్పుడు ఆమె కుటుంబ ఆదాయానికి గొప్ప సహకారి. SEWA వారి సహకార సేవింగ్స్ బ్యాంక్‌లో ఖాతాతో ప్రభుత్వ సామాజిక భద్రతను పొందుతుంది. ఇక్కడ ఆమె నెలవారీ పెట్టుబడి పెడుతుంది. భర్త ఆమెకు మద్దతు ఇస్తున్నాడు. తన సంఘంలో అజ్వాన్ బెన్ (ఇతర మహిళల నాయకురాలు)గా గౌరవించబడుతుంది. ఓ నివాదిక ప్రకారం అనధికారిక కార్మికులలో 50 శాతం మంది మహిళలు ఉన్నారని డేటా చూపిస్తుంది. అయితే భారతదేశ మొత్తం అనధికారిక శ్రామిక శక్తిలో మహిళలు 23 శాతం మాత్రమే ఉన్నారని అంచనాలు సూచిస్తున్నాయి. మహిళా అనధికారిక కార్మికులు పురుష అనధికారిక వేతన రేట్లలో సగం కంటే తక్కువ పొందుతున్నారు. ప్రధానంగా గృహ, గృహ ఆధారిత పనిలో, దాదాపు సగం మంది వారి కుటుంబాలలో ఏకైక జీవనోపాధిదారులు. అలాగే ఇల్లు, పిల్లలు, పెద్దల సంరక్షణకై అదనపు సమయాన్ని వెచ్చిస్తారు.
మహిళలు సంఘటితమైతే
సాధారణంగా మహిళలు సామాజిక సమస్యలు, భద్రత, మానసిక ఆరోగ్య సమస్యలతో అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. ఇటువంటి పరిస్థితుల్లో మహిళా అనధికారిక కార్మికులు తమను తాము సంఘటితం చేసుకుంటే అది వారికి బలం, సంఘీభావం, ధైర్యాన్ని ఇస్తాయి. దేశంలోని అతిపెద్ద మహిళల నేతృత్వంలోని సంస్థల్లో ఒకటైన SEWA వారి మనస్తత్వాలు, మార్గాలకు ఉదాహరణగా బ్రిడ్జ్స్పాన్ గ్రూప్ కమ్యూనిటీ ఆధారిత మార్పుపై తన నివేదికలో నమోదు చేసింది. ఈ విధానంలో స్థానిక సమూహాలు సామాజిక మార్పు కోసం పరిష్కారాల రూపకల్పన చేయడంలో చురుకుగా పాల్గొంటాయి. సోనా అశోక్బాయి సమతాని అనే 81 ఏండ్ల వీధి వ్యాపారి, మూడవ తరం SEWA సభ్యురాలు, కమ్లా హల్దార్ అనే 62 ఏండ్ల గృహ కార్మికురాలు, యూనియన్‌లో బోర్డు సభ్యురాలు. ఈ ముగ్గురూ SEWAతో కలిసి పని చేయడం వల్ల వారి జీవితాలు, కమ్యూనిటీలలో వారు చూసిన మార్పుల గురించి చెప్పారు.
వ్యవస్థలు మారుతున్నాయి
ఢిల్లీ అంతటా దాదాపు 30,000 మంది మహిళా వీధి వ్యాపారులు ఉన్నారు. SEWA ఢిల్లీలోని 8,300 మంది మహిళలకు ఉపాధి కల్పించింది. వారు తమ వస్తువులను ఐదు వర్క్సైట్లలో విక్రయించడానికి వీలు కల్పించారు. యూనియన్ ప్రయత్నాలు మొత్తం కమ్యూనిటీకి ఒక మైలురాయి విజయాన్ని అందించాయి. అందులో ఒకటి వీధి వ్యాపారుల చట్టం 2014. ''2013, 2014లో మేము జంతర్ మంతర్‌తో పాటు అనేక మంది రాజకీయ నాయకుల ఇళ్ల వద్ద ర్యాలీ చేసాము. ఎట్టకేలకు వీధి వ్యాపారుల బిల్లు ఆమోదం పొందింది. ఇప్పుడు మేము లైసెన్స్‌లను పొందుతున్నాము'' అని సమతాని అన్నారు. SEWA సభ్యులు వెండింగ్ సర్టిఫికేట్‌ను పొందుతారు. ఇది వారిని వేధింపులు, తొలగింపు నుండి రక్షిస్తుంది. స్వేచ్ఛగా పని చేసుకుంటూ ఎక్కువ సంపాదించుకుంటారు. సాధారణంగా నెలవారీ లాభాలలో 30 శాతం పెరుగుదలను చూస్తారు. ''మొదట పోలీసులు మా మాట వినేవారు కాదు. కానీ ఇప్పుడు మేము ఇప్పుడు మేము SEWA నుండి వచ్చాము అని చెబితే వారు మాకు సమావేశానికి సమయం ఇస్తారు'' అని గర్వంగా పంచుకున్నారు.
స్థిరమైన జీవనోపాధి కోసం
SEWA ఢిల్లీలోని 50,000 మంది గృహ కార్మికులతో పని చేస్తుంది. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, ఫ్యాషన్ డిజైన్‌పై శిక్షణను అందజేస్తుంది. వారికి వృత్తి నైపుణ్యాలను నేర్పిస్తుంది. ఢిల్లీలోని అనేక గార్మెంట్, టెక్స్టైల్ యూనిట్లకు వారిని లింక్ చేస్తుంది. ''మేము ఇకపై ఎవరిపై ఆధారపడటం లేదు. మా గాజులు, బిందీలకు తగినంత డబ్బు సంపాదించగలుగుతున్నాము'' అని గుప్తా అంటున్నారు. ఈ గుంపు నుండి సుమారు 350 మంది మహిళలు SEWA స్వంత నిర్మాణ కంపెనీ అయిన రుయాబ్లో పనిచేస్తున్నారు. ఇది బ్రాండ్లు, వినియోగదారులతో నేరుగా పని చేస్తుంది. మధ్యవర్తులను తొలగిస్తుంది. సురక్షితమైన జీవనోపాధిని నిర్ధారించడంలో సహాయపడుతుంది. మహిళా సేవా అర్బన్ కోఆపరేటివ్ థ్రఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ అయితే ఆర్థిక చేరికలు, ఆస్తుల సృష్టి కోసం SEWA ఒక గ్రౌండ్ అప్ పరిష్కారాన్ని ప్రోత్సహించింది. ఇది ఇప్పుడు 8,000 మంది మహిళల పొదుపులను నిర్వహిస్తోంది. కుట్టు మిషన్ల వంటి ఆస్తులను కొనుగోలు చేయడానికి నెలకు 1.5 శాతం చొప్పున రుణాలను అందిస్తుంది.
సాధికారత ఏజెన్సీ
SEWA సభ్యులు తమ గుర్తింపును స్థాపించుకోగలిగారు. తమ స్వాతంత్య్రాన్ని నొక్కిచెప్పగలరు, సవాళ్లను పరిష్కరించడానికి సామూహిక శక్తిని ఉపయోగించుకోగలిగారు. ''మొదట నేను కేవలం నా బిడ్డకు తల్లిని, భర్తకు భార్యను. ఇప్పుడు నేను కార్మికురాలిని. నాకంటూ సొంత గుర్తింపు ఉంది'' అంటున్నారు గుప్త. యూనియన్ ఇలాంటి వారికి వెన్నెముకగా పనిచేస్తుంది. యజమానుల చేతుల్లో, ఇంట్లో కూడా అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భాల్లో వారికి సామూహిక శక్తిని అందిస్తుంది. ''మాలో ఒక పెద్ద మార్పు ఉంది'' అని ఆమె జోడించారు. ''ఒకప్పుడు చాలా విడాకులు ఉండేవి. ఇప్పుడు అలాంటివి మహిళా మండల్ అనే SEWA స్థానిక మహిళా సామాజిక సేవా సమూహంకి నివేదించబడతాయని వారు భయపడుతున్నారు. ఇప్పుడు మాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మేము మా పరిష్కారాలను కనుగొంటాము. SEWA వారి కమ్యూనిటీలలోని మహిళల సామూహిక లక్ష్యాలు, అవసరాలను సూచించడానికి నాయకత్వాన్ని, శిక్షణ సభ్యులను కూడా ప్రోత్సహిస్తుంది. ఈ ఏజ్వాన్లు ఉద్యమాలను నిర్మించడానికి, నడిపించడానికి శిక్షణ పొందుతారు. SEWA నాయకత్వంలో అరవై శాతం మంది స్థానిక నాయకుల సమూహాల నుండి ఎన్నుకోబడ్డారు.
శక్తిని అభివృద్ధి చేయడం
SEWA సభ్యులు ఎక్కువగా వారి కుటుంబాలతో చర్చలు జరపగలుగుతారు. సామాజిక స్థలాలను క్లెయిమ్ చేయగలరు. ''వారు మనలను ఒంటరిగా అణచివేయగలరు. కానీ ఇప్పుడు మనలో 10 మంది వారిని ఎదుర్కోగలరు'' అని హల్దార్ పంచుకున్నారు. ఇప్పుడు సమాజంలో తమకు లభించిన గుర్తింపు పట్ల వారు సంతోషిస్తున్నారు.
''ఇంతకుముందు నేను ఇంటి నుండి బయటకు కూడా అడుగు పెట్టలేదు. నెమ్మదిగా ఇక్కడ 300 నుండి 400 మంది వ్యక్తులు నా గురించి తెలుసుకున్నారు. నేను ఏమైనా చేయగలనని మా కుటుంబం చెబుతోంది. SEWA వారి బహుముఖ కమ్యూనిటీ ఆధారిత విధానం స్త్రీలకు సమానత్వం వస్తుందనే విశ్వాసాన్ని అందించింది. ఈ విశ్వాసమే వారికి కొత్త లక్ష్యాల గురించి కలలు కనడానికి సహాయపడుతుంది. వారికి ధైర్యాన్ని ఇస్తుంది'' అని గుప్తా అన్నారు.
- సలీమ