Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రుతుస్రావ సమయంలో సెలవులు కావాలని మహిళలు ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు. కానీ దీనిపై పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతంది. ఆచరణలోకి మాత్రం రావడం లేదు. ఇటీవల కొన్ని రాష్ట్రాలు పీరియడ్స్ లీవ్స్‌ను మంజూరు చేస్తున్నాయి. అయితే ముంబయికి చెందిన న్యాయవాది, ఉద్యమకారిణి ఇందిరా జైసింగ్ ఇటీవలె దీనిపై స్పందించారు.
ఆమె ప్రకారం 'రుతుస్రావ సెలవులు మెడికల్ లీవ్స్ కాదు. ఇది ప్రకృతి సహజమైన చర్య. అలాంటి దాన్ని వైద్య సెలవులుగా ఎలా పరిగణిస్తారు. అలాగే శబరిమల గుడిలోకి కూడా మహిళలను రానీయకపోవడం అంటరానితనం కిందకు వస్తుంది. మన దేశంలో అంటరాని తనం నేరం. అలాంటప్పుడు మహిళలను రుతుస్రావ సమయంలో అంటరాని వారిగా ఎలా చూస్తారు? మా ఇంట్లో కూడా నా చిన్నతనంలో ఇలాంటి పరిస్థితి చూశాను. అమ్మాయిలను ఆ సమయంలో వంటింట్లోకి రానిచ్చేవారు కాదు. నేను ఒకసారి శబరిమల వెళ్ళినపుడు అపవిత్రమైందని ప్రత్యేక పూజలు చేసి శుద్ధి చేసుకున్నారు. మన దేశంలో ఇలాంటి ఆచారాలను భరించవలసి వస్తుంది. మరొక ముఖ్య విషయం ఏమిటంటే రుతుస్రావ సమయంలో సెలవు కావాలని చాలా మంది మహిళలు ఎప్పటి నుండో అడుగుతూనే ఉన్నారు. ఇది కొత్త విషయం ఏమీ కాదు. ఈ సెలవుల విషయంలో సంస్థలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అయితే ఇందులో నాకు మరో భయం కూడా కనిపిస్తుంది. ఆ సమయంలో సెలవు మంజూరు చేయడం ఎందుకని అసలు మహిళలకు ఉద్యోగాల్లోకే తీసుకోరేమో అనిపిస్తుంది. ఏది ఏమైనా రుతుస్రావ సెలవులను వైద్య సెలవుగా పరిగణించకూడదు. వీటిని సాధారణ సెలవులుగానే పరిగణించాలి''.