Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవాంఛిత రోమాలను ఎప్పటికప్పుడు తొలగించుకోవడం సహజమే. ఇందుకోసం వివిధ రకాల క్రీములు వాడడం, పదే పదే వ్యాక్సింగ్ ట్రీట్మెంట్లు చేయించుకోవడం.. వంటివి చేస్తుంటారు చాలామంది. అయితే వీటివల్ల చర్మం ఇరిటేట్ అయి ఎరుపెక్కడం, దురద రావడం.. ఇలా పలు సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి ముందు, తర్వాత ఆ ప్రదేశంలో చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడం తప్పనిసరి. ఇందుకోసం చర్మతత్వాన్ని బట్టి మాయిశ్చరైజింగ్ క్రీమ్లను ఎంపిక చేసుకోవాలి. వీటిలోని గ్లిజరిన్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి ఎలాంటి చర్మ సంబంధిత సమస్యలు ఎదురవకుండా చేస్తుంది. అలాగే వ్యాక్సింగ్ చేయించుకునే వారు పదే పదే కాకుండా.. వ్యాక్సింగ్కి, వ్యాక్సింగ్కి మధ్య కనీసం పదిహేను రోజులైనా గ్యాప్ తీసుకోవడం తప్పనిసరి. ఇలా షేవ్ చేసుకున్న వెంటనే పూల్స్, బీచ్లలోని నీటిలో ఈతకొట్టడం సరికాదు. దీనివల్ల ఆ నీటిలోని క్లోరిన్, ఉప్పు, సూర్యరశ్మి.. తదితర అంశాల వల్ల చర్మంపై ట్యాన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసం 24 గంటల సమయమైనా గ్యాప్ తీసుకోవాలి.