Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేసవిలో బయటికి వెళ్లాలంటేనే భయమేస్తుంది. చిన్న పిల్లల్ని, పెద్దవాళ్లని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. బయటికెళ్లొచ్చిన వెంటనే రీహైడ్రేట్ అవ్వాలంటే కొన్ని చిట్కాలను పాటిస్తే సరి... అవేంటంటే...
- శరీరాన్ని హైడ్రేట్ చేసే నీటితో కొంత వరకు ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
- మితమైన మోతాదులో కాఫీ, టీలతో శరీరానికి శక్తి వస్తుంది. అలాగే బాదంపాలు, టీలో దాల్చినచెక్క, లెమన్‌గ్రాస్, జాజికాయ వంటివి చేర్చడం ద్వారా హైడ్రేట్ అవొచ్చు.
- పాలల్లో అధిక ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని నీటినిల్వలను సమతుల్యం చేయడానికి ఉపయోగపడతాయి.
- కొన్ని పండ్లు, కూరగాయల్లో 80-90 శాతం నీరు ఉంటుంది. డీహైడ్రేట్ అయ్యేటప్పుడు పండ్ల రసాలవల్ల ఉపశమనం పొందొచ్చు. విటమిన్ సి ఉన్న పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యతనిస్తే సత్వర ఫలితాన్ని పొందొచ్చు.
- సమస్య ఎక్కువై వాంతులు, విరేచనాలు వంటివి వస్తే... ఓరల్ హైడ్రేషన్ సొల్యూ షన్స్ వినియోగించాలి. ఇందులో ఎక్కువ శాతం సోడియం, క్లోరైడ్, ఎలక్ట్రోలైట్స్ ఉండటం వల్ల అలసట, నీరసం తగ్గుతాయి.
- ఇవి అందుబాటులో లేనప్పుడు లీటర్ నీళ్లలో, 6చెంచాల చక్కెర, అర చెంచా ఉప్పు కలిపి తాగితే ఎండదెబ్బ నుంచి బయటపడొచ్చు.