Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విద్యార్థి దశ నుంచి ఒక్కసారే పోటీ ప్రపంచంలోకి అడుగుపెట్టడమంటే కొంత ఒడుదొడుకులెదురవుతాయి. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలో బాధ్యతలు చేపట్టాలంటే కొన్నిరకాల నైపుణ్యాలు తెలిసుండాలి. వీటినే కార్పొరేట్ సర్వైవల్ స్కిల్స్ అంటున్నారు నిపుణులు. ఆ నైపుణ్యాలేంటో మనమూ తెలుసుకుందాం...
- కెరియర్లోకి అడుగుపెట్టేటప్పుడు తెలియని వారు, గతంలో పరిచయం లేరంటూ ఎదుటపడిన వ్యక్తులను దాటి ముందుకెళ్లకూడదు. గతంలో ముఖ పరిచయం లేని వ్యక్తులతో కూడా మాట కలపడం నేర్చు కోవాలి. ఓ పలకరింపు అవతలివారి గురించి తెలుసుకో వడానికి మార్గం అవుతుంది. తెలియనివారితోనూ సునాయసంగా మాటకలపడం కొత్త సామర్థ్యమే. ప్రాజెక్ట్‌కు సంబంధించి తెలియని వ్యక్తులతో ఏర్పాటు చేసే సమావేశాల్లో ఈ నైపుణ్యం ఉపయోగపడుతుంది. కార్పొరేట్ కార్యాలయంలో విధులు నిర్వహించాలంటే చేపట్టాల్సిన బాధ్యతలపై అవగాహన ఉంటే సరిపోదు. సహోద్యోగులతో మెలగడం, ఉన్నతాధికారితో మాట్లాడే విధానంలో మెలకువలు తెలిసుండాలి.
- ఆఫీస్‌లో సహబృందంతో పరస్పర అనుబంధం ప్రాజెక్ట్ వివరించడం లాంటివి తేలిక చేస్తుంది. ఒకరి నొకరికి పరిచయం చేయడానికి ముందుగా బృందంలో ప్రతి ఒక్కరూ తెలుసుండాలి. ఇలా జరగాలంటే వారితో విడివిడిగా మాట్లాడటానికి ప్రయత్నించాలి. దీంతో ముందుగానే అందరి గురించి వివరాలు తెలుస్తాయి. ఆ తర్వాత బృంద నేతృత్వంలో అందరి మధ్య అనుబంధాన్ని ఏర్పరిచి విజయవంతంగా ప్రాజెక్ట్ పూర్తిచేయించొచ్చు.
- ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినడానికి ప్రయ త్నించాలి. అవసరమైతే చర్చించడానికి ఆసక్తి చూపించాలి. స్థాయి ఏదైనా... విజయం చిన్న దైనా.. పెద్దదైనా.. దానికి కారణమైనవారిని గుర్తించి ప్రశంసించాలి. అవతలివారు అపజయం తో నిరుత్సాహంగా ఉన్నప్పుడు.. మరోసారి ప్రయత్నించమంటూ ప్రోత్సహించాలి. అవసరమైతే సలహా ఇవ్వాలి. అంతే కాదు, ప్రాజెక్ట్ సొంతదైనా.. అనుకున్న సమయా నికి పూర్తి చేయలేకపోయినా, దానిపై సరైన అవగా హన లేకపోయినా సహాయం అడగడానికి వెనకాడొద్దు.