Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శరీరంలోని జీవక్రియలు సక్రమంగా జరగాలన్నా, కండరాలు బలోపేతం కావాలన్నా ప్రొటీన్లు ఎంతో అవసరం. ప్రత్యేకించి ఉదయాన్నే నిద్ర లేచింది మొదలు... ఊపిరి సలపని పనులతో నిత్యం బిజీగా ఉండే వారు అలసట కలగకుండా ఉండాలంటే ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీర కండర వ్యవస్థ దృఢమవుతుంది. దీంతో ఎలాంటి ఒత్తిడి, అలసట లేకుండా సునాయాసంగా అన్ని పనులు చేసుకోవచ్చు. అలాగే ప్రొటీన్లు గుండె బలంగా ఉండేందుకు, రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకూ దోహదం చేస్తాయి. తగినన్ని ప్రొటీన్లు లభించే ఆహారం తీసుకుంటే తక్కువ క్యాలరీలతోనే కడుపు నిండిన భావన కూడా కలుగుతుంది.
సాధారణంగా చేపలు, చికెన్, మటన్ లాంటి మాంసాహార పదార్థాల్లో ప్రొటీన్లు అధికంగా దొకుతాయి. అయితే మాంసాహారం అధికంగా తీసుకోవడం వల్ల కొందరిలో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమవుతుంటాయి. దీంతో చాలామంది మాంసాహారం మానేసి శాకాహారానికే ప్రాధాన్యమి స్తుంటారు. ఇదే సమయంలో శాకాహారం తీసుకునే వారిలో చాలామంది ప్రొటీన్ల లోపంతో బాధపడు తున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. అయితే ప్రొటీన్లు అధికంగా ఉండే కొన్ని శాకాహార పదార్థాలను ఆహారంలో భాగం చేసుకుంటే ఈ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చని పోషకాహార నిపుణులు సూచి స్తున్నారు. పైగా కూరగాయలు, పండ్ల నుంచి లభించే ప్రొటీన్లతో అమైనో యాసిడ్లు నేరుగా శరీరానికే అందుతాయని, ఇవి కండరాలను బలోపేతం చేస్తాయంటున్నారు. మరి ప్రొటీన్లు పుష్కలంగా దొరికే కొన్ని శాకా హార పదార్థాలు ఉన్నాయి.
పప్పుధాన్యాలు
కందులు, పెసలు, మిను ములు మొదలైన వాటిలో ఉండే పోషకాలతో పలు ఆరోగ్య ప్రయో జనాలున్నాయి. పప్పు ధాన్యాల్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. వీటి లోని పీచు పదార్థాలు కూడా శరీర బరువును పెరగకుండా చేస్తాయి. అదే విధంగా వీటిలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్ లాంటి దీర్ఘ కాలిక వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తాయి.
చిక్కుళ్లు
కిడ్నీ బీన్స్ (రాజ్మా), బ్లాక్ బీన్స్ వంటి చిక్కుడు జాతికి చెందిన పదార్థాల్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే ప్రొటీన్లతో పాటు బి-విటమిన్, ఫైబర్ శరీరానికి పుష్కలంగా అందుతాయి. అంతే గాకుండా వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తాయి.
నట్స్
ప్రొటీన్లతో నిండి ఉండే బాదం పప్పు, పిస్తా, అక్రోట్ వంటి గింజలను ప్రతిరోజూ తీసుకుంటే గుండె కు ఎంతో మేలు చేస్తాయి. వీటితో పాటు కొన్ని రకాల విటమిన్లు, ఫైబర్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే నట్స్‌లో క్యాలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి మితంగా తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పచ్చి బఠాణీలు
ఒక కప్పు పచ్చి బఠాణీల్లో 8 గ్రాముల వరకు ప్రొటీన్ ఉంటుంది. వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తాయి. తద్వారా క్యాన్సర్, డయాబెటిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి దూరంగా ఉండచ్చు. ఇవేకాక వీటిలో ఏ, కె, సి విటమిన్లు, ఫైబర్ వంటి పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి.
సోయాబీన్స్
సోయాబీన్స్‌లో మాంసాహారంతో సమానంగా ప్రొటీన్లు ఉంటాయి. ఇందులోని బి, డి, ఇ- విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, జింక్, అన్శ్యాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయి లను తగ్గించి రక్తపోటు సమ స్యను నివారిస్తాయి. సోయా లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ సమ్మేళనం మహిళల్లో మెనో పాజ్ సమస్యలను నివారించడంతో పాటు రొమ్ము క్యాన్సర్ నుంచి కూడా రక్షణ కలిగిస్తుంది.