Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజూ 'అప్పుడే తెల్లారిందా..' అనుకుంటూ లేవడమేనా? అలాకాకుండా ఉల్లాసంగా నిద్రలేచి.. అంతే ఉత్సాహంగా రోజంతా గడిపేయాలనుందా! అయితే ఈ చిన్ని మార్పులు చేసుకోమంటున్నారు నిపుణులు.
- ఆరోగ్యకరమైన జీవనశైలిలో నిద్రది ప్రధాన పాత్ర. కాబట్టి 7 గంటల నిద్ర.. నియమం పెట్టుకోండి. అలాగని నచ్చిన వేళలను ఎంచుకోవద్దు. రోజూ ఒకే సమయానికి పడుకోవడం లేవడం చేయాలి. అప్పుడే శరీరానికీ ఆరోగ్యకరమైన శైలి అలవాట వుతుంది. పడుకొనే ప్రదేశమూ నీట్గా ఉండాలి. తరచూ పక్క, కప్పుకొనే దుప్పట్లు, దిండు గలీబులు మారుస్తూ ఉండండి. సుఖనిద్ర ఖాయం.
- పడుకోవడానికి గంట ముందు గ్యాడ్జెట్లను దూరంగా ఉంచండి. వాటి నుంచి వెలువడే నీలికాంతి నిద్రను దూరం చేస్తాయి. ఫలితమే లేచాక చిరాకు వంటివి. బదులుగా పుస్తకం చదవడమో, ఉల్లాసంగా సాగే మ్యూజిక్ వినడమో చేయండి. నాణ్య మైన నిద్రను చేరువ చేస్తాయివి.
- మరుసటి రోజు చేయాల్సినవి.. చిన్నా, పెద్దా అన్నీ ఒక జాబితాగా రాసి పెట్టుకోండి. ఆరోజు ఎలా గడవాలి అను కుంటున్నారన్నదీ పైన రాయండి. ఇవి పూర్తి చేయాలన్న ప్రేరణని ఇవ్వడమే కాదు.. ముందే ప్లాన్ చేసుకు న్నామన్న భావన సుఖనిద్రని ప్రసాదిస్తాయట. దీంతో ఉల్లాసంగా నిద్ర లేవొచ్చు.
- లేవగానే పనిలో పడిపోవద్దు. ఓ పావుగంట చల్లగాలికి నడక, చిన్నపాటి వ్యాయామం తప్పక చేయాలి. శరీరంతో పాటు మెదడు చురుగ్గా తయారవుతుంది. ఎంత తీరిక లేకుండా ఉన్నా దీన్ని తప్పక కొనసాగించాలి.
- తర్వాత చేద్దాంలే అన్న పద్ధతే సగం కంగారుకి మూలం. దేన్నీ వాయిదా వేయొద్దు. ముందు ఇది చేసి పక్కన పడేద్దాం అనుకుంటూ సాగండి. టెన్షన్ మీ దరి చేరదు. పూర్తిచేసిన పని మనసుకు తెలియకుండానే ప్రశాంతతను ఇస్తుంది. మీ రోజును ఇలా ప్లాన్ చేసుకోండి. ఉత్సాహంగా లేవడం ఖాయం.