Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శరీరానికి సమతులంగా పోషకాలు అందకపోతే ఎన్నో అనారోగ్యాలు. పోషకాలు పుష్కలంగా అందాలన్నా, మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరాలన్నా.. రోజూ కాసిన్ని మొలకలు తినండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఎ ఆహారపుటలవాట్లు, జీవనశైలి కారణాలే వైతేనేం... మహిళలందరూ హార్మోన్ల అసమతుల్య తతో బాధపడుతున్నారు. అధికబరువు, నెలసరి క్రమం తప్పడం...లాంటి ఎన్నో సమస్యలకు మూలం. ఈ పరిస్థితిని అదుపులోకి తేవాలంటే రోజూ గుప్పెడు మొలకల్ని తినాలి. పెసర్లు, రాగులూ, బబ్బర్లు, రాజ్మా వంటివన్నీ కలగలిపి వాటితో పాటూ ఒక ఖర్జూరం కలిపి తీసుకుంటే సరి. ఇవి విటమిన్లూ, ఖనిజాలూ, ప్రొటీన్ వంటి పోషకాలన్నింటినీ సమతులంగా శరీరానికి అందిస్తాయి.
ఎ మెదడుకు రక్తం చక్కగా సరఫరా చేయడంలోనూ మొలకల్లోని పోషకాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఒత్తిడి, కుంగుబాటుతో బాధపడేవారు మొలకల్ని తీసుకోవడం మంచిది. వీటిల్లో దొరికే మెగ్నీషియం, క్యాల్షియం వంటివి నరాల వ్యవస్థను బలోపేతం చేస్తాయి. మానసిక ఒత్తిళ్లను దూరం చేస్తాయి.
ఎ బరువు తగ్గాలనుకునేవారు వీటిని ఎంత తీసుకుంటే అంత మేలు. వీటిలో లభించే పీచు జీర్ణవ్యవస్థ పని తీరును పెంచుతుంది. మొలకల్లో జింక్, ఇనుము, క్యాల్షియం ఎక్కువగా లభిస్తాయి. ఇవన్నీ శరీరంలోని అన్ని అవయవాలకూ సక్రమంగా ఆక్సిజన్‌ను సరఫరా చేస్తాయి. ముఖ్యంగా జింక్ సంతాన సాఫల్య సమస్యల్ని దూరం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.