Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చుట్టూ పిల్లలంతా ఉత్సాహంగా కనిపిస్తుంటే మన పిల్లలు మాత్రం నిత్యం అనారోగ్యంగా ఉండటం ఏ తల్లిదండ్రులకైనా బాధగానే ఉంటుంది. పోషకాహారాన్నిస్తున్నా ఎందుకిలా అవుతున్నారో చాలా మందికి తెలియదు. అయితే పిల్లలు తరచూ అనారో గ్యానికి గురికావడానికి కారణాలెన్నో అంటున్నారు నిపుణులు. వాతావరణం మారినప్పుడల్లా రకరకాల ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయి. వీటిని తట్టుకొనేలా పిల్లల్లో బాల్యం నుంచి పోషకాహారం అందించడం, పరిశుభ్రత అలవరచడంతో వ్యాధినిరోధక శక్తిని పెంచొచ్చు. జలుబు, దగ్గు, జ్వరం వంటివి పిల్లలకు తేలికగా ఇతరుల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని కూడా చిన్నారుల దరిదాపులకు రాకుండా చేయాలంటే వారిలో వ్యాధితో పోరాడే శక్తిని నింపాలి. ఇందుకోసం ముందస్తు జాగ్రత్తచర్యలు తీసుకోవాలి. లేదంటే తరచూ పిల్లలు అనారోగ్యాలకు గురవుతూనే ఉంటారు.
్థ పిల్లల్లో అనారోగ్యాలకు జీవనశైలి ప్రధాన కారణమం టున్నారు నిపుణులు. ఆహారపుటలవాట్లు, నిద్రా వేళలు వంటివన్నీ ఆరోగ్యానికి అనుసంధానమై ఉంటాయి. బయటి ఆహారంపై ఆసక్తి, ఎక్కువగా గ్యాడ్జెట్ల వినియోగం, టీవీ ముందు గంటలతరబడి సమయం వెచ్చించడం, క్రీడలకు ప్రాధాన్యతనివ్వక శారీరక శ్రమ లేకపోవడం, నిద్రలేమి వంటివన్నీ చిన్నారులను బలహీనులుగా మారుస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే ఆహారం, నిద్రవేళల్లో సమయపాలన పాటించేలా చేయాలి. అప్పుడే వారిలో జీవక్రియలు సవ్యంగా సాగుతాయి. అవయవాలన్నీ ఆయా సమయానికి తగినట్లు పనితీరును మెరుగుపరుచుకుంటాయి. దీంతో వ్యాధినిరోధక శక్తి పెంపొంది, తరచూ అనారోగ్యాలు వారిపై దాడి చేయలేవు.
్థ తోటివారితో ఆడుకోవడానికి పిల్లలను ప్రోత్సహించాలి. దగ్గర్లోని ఈతకొలనులో శిక్షణ, లేదా బ్యాట్మెంటన్, క్రికెట్ క్లబ్స్ లో చేర్చడం మంచిది. సైక్లింగ్ అలవాటుగా మార్చాలి. ఒకేచోట కూర్చొని ఉండటం అనారోగ్యమని చెప్పాలి. అప్పుడే కండరాల కదలికతో జీర్ణాశయం పనితీరు మెరుగుపడి, చిన్నారులకు ఆకలి వేస్తుంది. దీంతో ఆహారం తీసుకోవడంలో ఆసక్తి చూపిస్తారు. పోషకవిలువలున్న కూరగాయలపై అవగాహన పెంచడం, వాటినెలా వండుతారో దగ్గరుండి చూపించడం వంటివి చేస్తే వాటిని తీసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. వ్యవసాయమెలా చేస్తారు, కూరగాయలు, ఆకుకూరల పెంపకాన్ని వీలున్నప్పుడు తీసుకెళ్లి చూపించగలిగితే మరీ మంచిది. అలాగే కంటినిండా నిద్రపోవడాన్ని ప్రోత్సహిస్తూ, కథలు చెప్పడంతో పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.