Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గులాబీ దండు సభ్యులు గులాబీ రంగు చీరలు ధరించి, చేతిలో గులాబీ లాఠీతో అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతూ 2006లో యుపీలోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని బందా జిల్లాలో గృహ హింసతో పాటు మహిళలపై జరుగుతున్న వివిధ రకాల హింసకు వ్యతిరేకంగా, ప్రతిస్పందనగా ఈ గులాబీ దండు ముందుకు వచ్చింది. వారి పోరాటాని చిహ్నంగా వారు ధరించే గులాబీ రంగుకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. సమకాలీన డిజైన్లకు కేరాఫ్ అడ్రస్‌గా గుర్తించబడిన లండన్ మ్యూజియం గులాబీ గ్యాంగ్ ధరించే 'పింక్ చీర'ను ఈ ఏడాది సోదరీమణుల కథగా జరుపుకోవడానికి సిద్ధమవుతుంది.
శతాబ్దాలుగా భారతీయ మహిళ వ్యక్తిత్వాన్ని సూచించే గులాబీ రంగు ఆరు గజాల తెరపై స్త్రీ శక్తిగా సమ్మిళితం చేయబడుతుంది. ఈ ఏడాది మేలో ప్రారంభం కానున్న డిజైన్ మ్యూజియం ఆఫ్ లండన్‌లో భారతీయ ఫ్యాషన్‌పై నిర్వహించనున్న ఎగ్జిబిషన్లో 'గులాబీ గ్యాంగ్' అనే మహిళా విజిలెంట్ గ్రూప్ పింక్ చీరను వారి పోరాటానికి గుర్తుగా ''ఆఫ్‌బీట్ చీర''గా ప్రదర్శించడానికి ఎంపిక చేశారు.
11 లక్షల మంది సభ్యులతో...
సంపత్ పాల్ దేవి ప్రారంభించిన ఈ అసాధారణ మహిళా ఉద్యమం ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతి పొందిన సంస్థగా మారింది. ''ఇప్పుడు మేము ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాము. మహిళల హక్కుల కోసం పోరాడుతున్న మా ప్రయత్నాలను గుర్తించిన మొదటి విదేశీ దేశం ఫ్రాన్స్. వారు 2008లో నన్ను ఆహ్వానించారు. ప్రస్తుతం 18-60 ఏండ్ల లోపు 11 లక్షల మంది సభ్యులతో కూడిన సంస్థగా మేము ఎదిగాము. మహిళలపై ఎక్కడ హింస జరిగినా మా దండు అక్కడ ప్రత్యక్షమవుతుంది'' అని సంపత్ పాల్ దేవి చెప్పారు. ఫోన్.
ప్రతిఘటనకు గుర్తుగా...
ఈసారి డిజైన్ మ్యూజియంలో ప్రదర్శన కోసం తన సంస్థ సంతకమైన 'పింక్ చీర', బ్లౌజ్, పెటికోట్తో పాటు గులాబీ లాఠీని కొరియర్ ద్వారా లండన్‌కు పంపుతున్నట్లు సంపత్ పాల్ దేవి చెప్పారు. లండన్‌లోని డిజైన్ మ్యూజియం సమకాలీన చీర వేడుకను జరుపుకోవడానికి మే నుండి సెప్టెంబర్, 2023 వరకు ప్రదర్శనను నిర్వహిస్తుంది. ప్రియా ఖంచందానీచే నిర్వహించబడిన ఈ ప్రదర్శనలో భారతదేశంలో హింసకు వ్యతిరేకంగా మహిళలు చేస్తున్న పోరాట నిర్వచనాలకు ఒక రూపకం వలె ఈ చీరను ప్రదర్శిస్తారు. అయితే ఈ-మెయిల్ ద్వారా గులాబీ గ్యాంగ్ వ్యవస్థాపకురాలు సంపత్ పాల్ దేవిని సంప్రదించిన ఖంచందానీ, చీర కూడా భారతీయ మహిళకు ఒక ప్రతిఘటన గుర్తుగా మారిందనడానికి ఉదాహరణగా గులాబీ దండుకు చెందిన ఒక 'పింక్ చీర'ని ఎగ్జిబిషన్ కోసం పంపమని కోరింది.