Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మామూలుగానే ఈ కాలంలో త్వరగా అలసిపోతుంటాం. అదనంగా డైటింగ్ కూడా చేస్తోంటే నీరసం ఆవరించేయదూ? మరెలాగంటారా! ఈ చిట్కాలు పాటించేయండి. అలసిపోరు.. బరువుపై బెంగా ఉండదంటున్నారు నిపుణులు.
- మూడు పూటలా భోజనం తినే విధానాన్ని అనుసరించొద్దు. చాలా తక్కువ మొత్తంలో 5-6 సార్లు ఆహారం తీసుకునేలా ప్లాన్ చేసుకోండి. రక్తంలో చక్కెర స్థాయులు పడిపోవు.. నీరసమూ దరిచేరదు.
- ప్రోటీన్ ఎక్కువగా అందే నట్స్, పాలు, పెరుగు, పనీర్ వంటివి స్నాక్స్‌లో భాగం చేసుకోండి. శక్తి తరిగిపోతుందన్న బెంగ ఉండదు. పైగా రోజంతా ఉల్లాసంగా ఉండేలా చేస్తాయివి. నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు.. ఏదో రూపంలో తగినంత నీరు శరీరానికి అందేలా చూసుకోవడమూ తప్పనిసరే! తగినన్ని నీరు తీసుకోకపోయినా కళ్లు తిరగడం, నీరసం వంటివి కనిపిస్తాయి.
- వేయించిన, నూనెతో చేసిన పదార్థాలకు దూరంగా ఉండండి. ఇవి అరగడానికి ఎక్కువ సమయం తీసుకొంటాయి. శరీరానికీ బద్ధకపు భావన తెచ్చిపెడతాయి. తీపి తినాలనిపిస్తే బెల్లం, తేనెతో చేసినవాటిని ఎంచుకుంటే మేలు.
- మిగతా కాలాలతో పోలిస్తే వేసవిలో ఎక్కువ పోషకాలూ అవసరమవుతాయి. తాజా కూరగాయలు, పండ్లు భర్తీ చేయగలవు. కాబట్టి, వీటికి ఆహారంలో ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి.