Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వృత్తిరీత్యా మనకు వారాంతాల్లో ఒకటి లేదా రెండు రోజులు సెలవులుంటాయి.. కానీ గ్యాడ్జెట్స్‌కు మాత్రం మనం ఒక్క పూటైనా సెలవివ్వం. ఇలా నిర్విరామంగా పనిచేయడం వల్ల అవి అలసిపోతాయో లేదో గానీ.. మనమైతే విపరీతంగా అలసిపోవడం ఖాయం. ఎందుకంటే వారంలో ఐదారు రోజులు పనిలో భాగంగా గ్యాడ్జెట్స్‌తోనే గడుపుతాం. డిజిటల్ లోకంలోనే విహరిస్తాం.. తద్వారా ఎదురయ్యే ఒత్తిడి నుంచి రిలాక్సవడానికే వారాంతాల్లో వచ్చే సెలవులు ఉపయోగపడతాయి. అలాంటిది అప్పుడు కూడా గ్యాడ్జెట్స్‌తోనే గడుపుతామంటే ఎలా చెప్పండి? ఇలా అయితే మానసిక ప్రశాంతత ఎప్పుడు దొరుకుతుంది?
- వారాంతాల్లో మీరు కూడా మీ గ్యాడ్జెట్స్‌కి సెలవిచ్చేయండి. మరీ రోజంతా అంటే కష్టమనుకుంటే కనీసం ఓ పూటైనా వాటిని కనికరించండి! ఆ సమయంలో హాయిగా నిద్రపోండి.. కాసేపు వ్యాయామం చేయండి.. కుటుంబసభ్యులతో కబుర్లు చెప్పండి.. ఇలా కనీసం వారానికొకసారైనా అలవాటు చేసుకున్నారంటే మీలోని ఒత్తిళ్లు, ఆందోళనలు అన్నీ హుష్‌కాకి అయిపోవా ల్సిందే! శరీరానికైనా, మనసుకైనా ఇంతకు మించిన రిలాక్సేషన్ ఏముంటుంది చెప్పండి!
- సోషల్ మీడియా ఉపయోగిం చడం ఇప్పుడు అందరికీ కామనైపోయింది. అయితే వాటిని అవసరం కోసం వినియోగించుకొనే వారు కొందరైతే.. టైంపాస్ అంటూ వాటి వెంట పడే వారు మరికొందరు. దేన్నైనా అతిగా వాడితే మొదటికే మోసమొస్తుంది. అవసరం లేకపోయినా కొంతమంది ప్రతి ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. దీనికి తోడు చిన్న పిల్లల ఫొటోలు, సమాచారం కూడా అందులో షేర్ చేస్తుంటారు. అసలే ఆన్లైన్ మోసాలు, ఫొటో మార్ఫింగ్స్, ఖాతాల్ని హ్యాక్ చేసి వాటిని దుర్వినియోగపరచడం.. వంటివి ఎక్కువగా జరుగుతోన్న ఈ రోజుల్లో సోషల్ మీడియాను వీలైనంత తక్కువగా వాడుకోవడం ఉత్తమం.
- ఫోన్, ల్యాపీ.. ఇలా వీటిని మన ఖాళీ సమయాల్లో కూడా వెంటే ఉంచుకోవడం వల్ల పదే పదే వాటిపైకే మన దృష్టి మళ్లుతుంది. అందుకే డిజిటల్ డీటాక్స్‌లో భాగంగా వాటిని మన కంటికి కనిపించనంత దూరంగా పెట్టేయడం మంచిది. తద్వారా మనం చేసే ఇతర పనులపై పూర్తి శ్రద్ధ పెట్టచ్చు.
- డిజిటల్ డీటాక్స్‌ని ఇంట్లో మీరొక్కరే పాటిస్తూ.. ఇతరులు విచ్చలవిడిగా గ్యాడ్జెట్స్‌తోనే గడుపుతున్నారనుకోండి.. మీకూ వాటిపైకే మనసు మళ్లు తుంది. కాబట్టి ఈ పద్ధతిని ఇంట్లో అందరూ పాటించేలా ఒక నియమం పెట్టుకోండి.. కావాలంటే 'ఈ పద్ధతిని ఎవరు ఎక్కువ సేపు పాటిస్తారో చూద్దాం..!' అంటూ ఓ ఛాలెంజ్ విసురుకోండి.. ఈ సమయంలో అందరూ కలిసి ఏదో ఒక గేమ్ ఆడడం, వంటలో ఒకరికొకరు సహాయపడడం.. వంటివి చేయచ్చు. ఇలా చేయడం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.. అనుబంధాలూ దృఢమవుతాయి.