Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందంగా, ఆరోగ్యంగా మెరిసే చర్మం కావాలనుకోవడం సహజమే! అందుకు తగ్గ నియమాలు పాటిస్తున్నారా మరి? అవేంటంటే..
- ఎండకి వీలైనంత దూరంగా ఉండండి. ఇది చర్మానికి హాని చేయడమే కాదు.. ఇతర సమస్యలనూ కలిగించ గలదు. అంతేకాదు వృద్ధాప్య ఛాయ లకీ ఇదే ప్రధాన కారణం. ఎండలోకి వెళ్లాల్సి వస్తే బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్‌ని తప్పనిసరిగా రాయాలి. సహజ సౌందర్య ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వండి. రసాయనాలు, ప్రిజర్వేటివ్స్‌తో కూడినవి చేటు చేయగలవు.
- చర్మానికి లోపలి నుంచి పోషణ కావాలి. కాబట్టి ఆరోగ్యానికి హాని కలిగించే ప్రాసెస్డ్, చక్కెర పదార్థాలు, జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. బదులుగా తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలకు ప్రాధాన్యమివ్వాలి. రోజులో తగినన్ని నీరు తాగుతున్నారా లేదా అన్నది చూసుకోవాలి.
- ఒత్తిడి ప్రభావం మనసుపైనే కాదు.. చర్మంపైనా పడుతుంది. యాక్నే, త్వరిత వృద్ధాప్యఛాయలు వంటి ఎన్నో సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలపై దృష్టి పెట్టండి. 7-8 గంటల నిద్ర తప్పనిసరి చేసుకోండి.
- చర్మానికి రోజువారీ సంరక్షణ మంచిదే. అయితే అది హద్దు దాటుతోందేమో కూడా చూసుకోవాలి. అతిగా స్క్రబింగ్, పదే పదే ఉత్పత్తులను మార్చడం వంటి వన్నీ చర్మంపై ఒత్తిడికి కారణమవుతాయి.