Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొందరి ఇళ్లు చూడగానే ఇట్టే ఆకట్టుకునేలా ఉంటాయి. హంగులూ ఆర్భాటాలూ లేకపోయినా మనసుని హత్తుకుంటాయి. అలా మనమూ ఇంటిని మార్చుకోవచ్చు. కొన్ని మార్పులు చేయాలంతే... అవేంటో తెలుసుకుందాం...
- కొందరు ఇల్లు అందంగా కనిపించాలని రంగు రంగుల దీపాలు ఉపయోగిస్తారు. కానీ రంగు రంగుల దీపాలు ప్రశాంతతనీయవు. ఎబ్బెట్టుగానూ ఉంటాయి. సాధ్యమైనంత వరకూ సహజకాంతి ఇంట్లో ప్రసరించేలా చూసుకోవాలి. దానివల్ల గదిలో వెలుతురు పడి ఆకర్షణీయంగా ఉంటుంది. సూర్యకాంతిని ప్రతిబింబించే అద్దాలు, పాలిష్డ్ లోహాలు గదిలో ఉంచాలి.
- ఇల్లు చిన్నదైనా పెద్దదైనా మొక్కలు పెంచుకోవటానికి స్థలం కేటాయించాలి. ప్రస్తుతం బయోఫిలిక్ డిజైన్‌కు మంచి ఆదరణ ఉంది. ఇంట్లో బోన్సాయి, సక్యులెంట్లు, పొడవాటి మొక్కలు పెంచితే మనసుకు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి.
- ఇల్లంతా గృహోపకరణాలతో నింపేయాలన్నది పాత పద్ధతి. ఎంత తక్కువ వస్తువులు ఉంటే అంత అందమన్నది ఇప్పటి ఫ్యాషన్. మినిమలిజం అనేది విలాస వంతులకు ఒక స్టైల్లా కాక జీవన విధానంగా మారింది. ఎక్కువ వస్తువులు లేకుండా ఉంటే ఇళ్లంతా ప్రశాంతంగా ఉంటుంది.
- మన దేశంలో సహజ సిద్ధంగా తయారయ్యే వస్తువులకు కొదవే లేదు. చేనేత వస్తువులు, కళాఖండాలు ఇంట్లో ఉపయోగించాలి. అప్పుడే భవిష్యత్ తరాలకూ ఒక సందేశాన్ని అందించిన వారమవుతాం.
- చేతితో తయారు చేసే ఆభరణాలు, కళాఖండాలు, దుస్తులు, వంటి వాటిని ఎంచుకోవాలి. ఇలాంటివి ఇంట్లో ఉంటే ఆ కళే వేరు.