Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎండాకాలం వచ్చిందంటే దాహం పెరుగుతుంది. జ్యూస్, మజ్జిగ, ఐస్ క్రీం ఇలా ఎన్నో శీతల పానీయాలు తాగాలని మనసు తహతహలాడుతుంది. అయితే వేసవిలో వేసవిలో గొంతు మాత్రమే కాకుండా మొత్తం శరీరాన్ని కూడా చల్లగా ఉంచుకోవాలి. అదే సమయంలో ఆరోగ్యంగా కూడా ఉంచుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇందుకోసం జ్యూస్‌లు తీసుకోవడం బెటర్ అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఎలాంటి జ్యూస్‌లు తీసుకోవాలో తెలుసుకుందాం...
- కలబందలో ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని తీసుకోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, సోడియం, ఐరన్, కాల్షియం మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి. అనేక శరీర సమస్యలను నయం చేయడంతో పాటు, ఇది చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది. వేసవిలో దీన్ని తాగడం వల్ల రోజంతా తాజాగా ఉంటుంది.
- చెరకు రసం వేసవిలో సూపర్ ఎనర్జీ డ్రింక్‌గా చెప్పుకొవచ్చు. శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది. అలాగే అనేక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. ఇందులో ఫైబర్, కాల్షియం, పొటాషియం, ఇతర పోషకాలు ఉంటాయి. ఈ జ్యూస్ డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. అంతే కాకుండా జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
- కాకరకాయ రసం చేదుగా ఉన్నప్పటికీ.. ఆరోగ్యానికి చేసే మేలు అమోఘం అని చెప్పాలి. డయాబెటిక్ పేషెంట్లకు కాకరకాయ రసం దివ్యౌషధం. దీనిని తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి.
- వేసవిలో ఆకు కూరలు తినడం చాలా మంచిది. మీ ఆహారంలో పాలకూరను చేర్చుకోవడం ఉత్తమం. అలాగే పాలకూర జ్యూస్ తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.