Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అన్నింట్లోనూ సహజత్వాన్ని కోరుకునే మనం వంటగదిని కూడా ఎకోఫ్రెండ్లీగా తీర్చిదిద్దుదాం. వంటగదిలోని అన్నింటినీ మనసుకు నచ్చిన విధంగా, ఆహ్లాదకరంగా మార్చేద్దాం..
- సరకులను నిల్వచేసేందుకు ప్లాస్టిక్ డబ్బాలకు బదులుగా గాజు, పింగాణీ సీసాలను, స్టీలు పాత్రలను ఉపయోగించొచ్చు. చూడటానికి అందంగా ఉండడమే కాక ఆరోగ్యానికీ, పర్యావరణానికీ చేటుచేయవు.
- ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులకు బదులుగా కూరగాయలు తరిగేందుకు చెక్కవి ఉపయోగిస్తే మేలు. వంట కోసం మట్టి పాత్రలను కూడా ప్రయత్నించొచ్చు.
- కూరగాయలను బయటినుంచి తెచ్చుకునేందుకు ఫ్రిజ్‌లో భద్రపరుచుకోడానికి కూడా రీ యూజబుల్ సంచులను వినియోగిస్తే సరి. ఇంట్లో పాలిథీన్ కవర్లు పేరుకోకుండా ఉంటాయి.
- కరెంటుతో పనిచేసే అవెన్లు, ఏసీలు, ఫ్రిజ్ల్లాంటి వస్తువుల్లో కరెంటు ఆదా చేసేవి ప్రత్యేకంగా ఎంపిక చేసి కొనండి. వంటగది వ్యర్థాలను పడేయటానికి బదులుగా కంపోస్ట్ తయారు చేస్తే సరి. దాన్ని గార్డెన్లో ఉపయోగిస్తే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి.
- ఇంట్లో అక్కడక్కడా కుండీల్లో మొక్కలు పెంచటం వల్ల లోపల ఉన్న కార్బన్‌డైఆక్సైడ్ ఆక్సిజన్‌గా మారుతుంది. స్వచ్ఛమైన గాలితో, పచ్చదనం కనిపిస్తుంటే ఇల్లు కూడా ఆహ్లాదంగా మారుతుంది.