Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమస్య పరిష్కారం కోసం సృజనాత్మక ఆలోచించడం ఎలాగో సుర్భిగుహ లాంటి వారికి బాగా తెలుసు. అందరితో కలవలేని ఓ అమ్మాయి. ఆరుగురు ఉన్న గదిలో కూడా మాట్లాడడానికి జంకుతూ ఉండే 23 ఏండ్ల యువతి. అయితే వచ్చిన సమస్యను అధిగమించాలనే దృఢ సంకల్పమే సోర్టిజి బిజినెస్ ప్రయాణానికి ఊపిరిపోసింది. ప్రారంభించిన అతితక్కువ కాలంలోనే ఎంతోమంది వినియోగదారులను చేరుకుంది. సోర్టిజి యాప్ గూగుల్ ప్లే ఎవ్రిడే ఎసెన్సియల్ కేటగిరి కింద భారతదేశంలోనే ఉత్తమ యాప్‌గా అవార్డు అందుకుంది. పెద్ద యాప్‌ల పక్కన తానూ నిలబడింది. వి హబ్‌తో కలిసి ఏఆర్హెఏ రివాల్వింగ్ ఫండ్ స్వీకరించిన మొట్టమొదటి మహిళా స్టార్టప్‌గా పేరు పొందింది. ఆరోగ్యకరమైన ఆహారానికి కేరాఫ్ అడ్రెస్ వంటి సోర్టిజి డిజిటలైజ్డ్ పాకశాలను ప్రారంభించిన ఆమె పరిచయం నేటి మానవిలో...
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మరి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే మంచి పోషకాలతో కూడిన రుచికరమైన భోజనాన్ని తీసుకో వాలి కదా! అలాంటి ఆహారం దొరకడం ప్రస్తుతం చాలా కష్టంగా మారిపోయింది. ఇక ఉద్యోగం కోసమో, పై చదువుల కోసమో ఒంటరిగా ఉండే పిల్లల గురిం చైతే చెప్పేదేముంది? రాత్రి పడుకోబోయే ముందు మనందరినీ వేధించే సమస్య రేపు ఏం వండాలా? అని. వీటన్నింటికీ పరిష్కారంగా సుర్భిగుహ ఓ పాకశా లను ప్రారంభించింది. అంతే కాదు ఆడవాళ్లను వంటింటికే పరిమితం చేయడానికి చెక్ పెట్టాలను కుంది. కుటుంబసభ్యుల్లో ఎవరైనాసరే సరదాగా, చలాకీగా వంట చేసుకునే విధంగా ఓ యాప్‌ను సృష్టిం చింది. 2020లో వరంగల్‌కు చెందిన సుర్భి గుహ ఖరగ్‌పూర్‌కు చెందిన స్గతి ప్రకాష్, అక్షరు, నితిన్ గుప్తాతో కలిసి ఈ యాప్ రూపొందించారు.
కుటుంబ నేపధ్యం
సుర్భి గుహ తాతగారు స్వాతంత్య్ర సమర యోధులు. వీరు ప్రెసిడెన్సీ అవార్డు గ్రహీత. నాగపూర్ వాస్తవ్యులు. తండ్రి సునీల్ గుహ, భారత రైల్వే శాఖలో రైల్వే మెనేజర్. తల్లి మనోరమ గృహిణి అమ్మానాన్న లకు ముగ్గురు సంతానం. సుర్భి గుహ అన్నయ్య రతన్ యూఎస్ఏలో వార్టన్ యూనివర్సిటీలో ఎంబీఏ చేస్తు న్నాడు. చెల్లి ప్రజ్ఞ యూఎస్‌లో మాస్టర్స్ చేస్తుంది. సుర్భి గుహ 2018లో వరంగల్‌లో ఇంటర్ పూర్తి చేసింది. గణితంలో వంద శాతం మార్కులు సాధించి నందుకు మహారాష్ట్ర హోంశాఖా మంత్రిచే అవార్డు అందుకుంది. శాన్ప్రాసిస్కోకి సంబంధించిన ఒర్బీస్ మెడికల్ బిజినెస్ సొల్యుషన్స్ అనుబంద సంస్థ హైద రాబాద్‌లో బిజినెస్ కన్సల్టెంట్‌గా సీటు వచ్చింది. ఇందులో బాగంగానే మొదటి సారిగా వరంగల్ నుండి ఆమె హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది. అదుగో అప్పుడే సమస్య మొదలయ్యింది.
ఇబ్బందులు ఎదుర్కొంది
అప్పటివరకు అమ్మచేతి కమ్మనైన భోజనం అలవాటైన సుర్భీకి తప్పనిసరి పరిస్థితుల్లో వంట తనే చేసుకోవల్సి వచ్చింది. సమయం సరిపోక ఇబ్బంది ఎదుర్కొంది. తనలాగే తన సహోద్యో గులు కూడా ఇలాంటి ఇబ్బందినే ఎదు ర్కుంటున్నారని తెలుసుకుంది. వంట చేసుకునే సమయం, అనుభవం, అవ గాహన లేదు. ఇదే విషయాన్ని సహో ద్యోగులు కలిసి చర్చించుకునే వారు. ఉరుకుల పరుగుల జీవితంలో కడుపు నిండా తినడానికే సమయం లేదు. ఇక అంతంత మాత్రం అవగాహన ఉన్న వాళ్ళు ఆరోగ్య కరమైనవి ఎలా వండు కుని తినగలరు? దీనికి ఏదైనా పరి ష్కారం ఆలోచించాలని నిర్ణయించుకున్నారు. ఈ సాంకేతిక ప్రపంచంలో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలన్నీ ఒకే చోట దొరికేలా చేస్తే బాగుంటుందను కున్నారు. వాటన్నింటినీ డిజిటలైజ్ చేస్తే ఇంటికి దూరంగా ఉండే విద్యార్థులకు, యువతకు, ఉద్యోగాల్లో బిజీగా ఉండేవారికి ఎంతో సౌలభ్యంగా ఉంటుంద నుకున్నారు.
ఆహర సమాచారం కోసం
వడ్డించిన విస్తరిలా చిటికెలో ఆహారానికి సంబం ధించిన సమాచారం ఉండాలని ఆలోచనలోంచి ఆవిష్కరించబడిందే సోర్టిజి యాప్. ఒకవిధంగా చెప్పా లంటే ఇది డిజిటలైజ్డ్ ఆధునిక వంటశాల. ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్టుగా స్టార్ట్అప్ ప్రారంభించ డానికి ముందు 50 సంవత్సరాల వ్యాపార అనుభవం ఉన్న ఐఐటీ మద్రాసు పూర్వ విద్యార్థుల సంఘంతో కలిసి తన వ్యాపార ప్రయాణాన్ని మొదలుపెట్టారు సర్భీ. దానికి సంబంధించిన గ్రాంట్ కోసం ఐఐటీ హైదరా బాద్‌లో దరఖాస్తు చేసుకుంటే ఎంపిక చేసారు. స్టార్ట్ అప్‌లో ఎలాంటి అనుభవం లేదు. అయినా సమస్యకు పరి ష్కారం అందించాలనే పట్టుదలతో సుర్భి మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి పెట్టారు. దీని వల్ల కొద్దిగా ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఒకవైపు కరోనా మహమ్మారి సృష్టించిన లాక్డౌన్, ఇంట్లో వాళ్ళ ఆరోగ్య సమస్యలు, జీతాలు లేకపోవడం, తన లాంటి ఆలోచ నలున్న సహ వ్యవస్థాపకులు దొరకడం, సాంకే తిక సహాయం కోసం నిపుణులను వెదడకం, వారిని ఒప్పించడం అన్నీ ఖర్చులతో కూడిన పనులే. ముఖ్యంగా టీం తయారు చేసుకోవడమే ఒక సవాలుగా మారింది. అయితే 450 మంది యువతతో స్టార్ట్ అప్ ప్రారంభించాలనే సంకల్పం ముందు ఆమెకు ఇవేవి కష్టం అనిపించలేదు.
ఇక ఆందోళన లేకుండా...
ఎప్పుడూ అదే ధ్యాస. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రొడక్ట్స్‌లో అనుభవం ఉన్న IIT, BITS, IIIT, NIT కి సంబంధించిన అగ్రశ్రేణి కళాశాలల నుంచి బృందాన్ని సేకరించారు. యాప్‌ని ప్రారంభించ డానికి నిధుల సేకరణ ప్రారంభించారు. ఈ ప్రయాణంలో ప్రభుత్వ సంస్థలు, ప్రముఖ సంస్థాగత వ్యవస్థలు, పంజాబ్ ఇన్వెస్టర్లు ఈ స్టార్ట్ అప్ను మరింత ముందుకు తీసుకె ళ్ళడానికి తోడుగా నిలబడ్డాయి. ఐఐటీ హైదరాబాదు, వి హబ్ అడుగడుగునా అండగా ఉండి సోర్టిజీ ఎదుగు దలకు సహకరించాయి. కేంద్ర ఎలక్ట్రానిక్ ఐటీ మంత్రిత్వ శాఖ నుండి గ్రాంట్ వచ్చింది. ఇంకా ఎందరి నుండో పెట్టుబడులు పొందారు. ఏ విధమైన ఆందోళన లేకుండా హాయిగా అమ్మ, అమ్మమలు అందించిన రుచి కరమైన ఆహారం వండుకునే విధానం, కావలసిన కిరాణ, వేలాది మల్టీ మీడియా రెసిపీ గైడ్స్, బ్రాండ్స్, ఉత్పత్తులు, సులభమైన భోజన ప్రణాళిక, ఫుడ్ బ్లాగర్ల నుండి కంటెంట్, హోం కుక్ పరిచయాలు, వాటికి సంభందించిన వీడియోలు అన్నీ ఒక్కచోటే ఏర్చి కూర్చి అందించే ప్రత్యేక ఫుడ్ పోర్టల్ ప్లాట్ ఫోరం 'సోర్టిజి'గా తయారయింది. ముఖ్యంగా 22 నుంచి 40 ఏండ్ల లోపు ఉండేవారి అవసరాలను దృష్టిలో పెట్టు కుని శాఖాహార మాంసాహార లిస్టు ఇందులో ఉంటుంది. అలాగే పోషక విలువలతో కూడిన డైట్ ప్లాన్, వారానికి సరిపడా టిఫిన్లు, మధ్యాహ్న, రాత్రి భోజన ప్రణాళిక లతో రూపొందించబడింది ఇది. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఎన్నో లక్షల మంది తమకు నచ్చిన వంట చేసుకుని తినేలా ప్రోత్సహిస్తుంది
మూడు ప్రణాళికలు...
బారతదేశంలో ఫుడ్ స్పేస్ వీడియో రౌరెక్స్లో అగ్రగామిగా ఉంటూ మూడు ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తున్నారు సోర్టేజి వ్యవస్థాపక బృందం. అందులో ఒకటి వివిధ రకాల ఆహార తయారీ విధా నాల ద్వారా వినియోగదారుడు తనకు నచ్చిన ఆహా రాన్ని సులభంగా తయారు చేసుకోవడం. రెండవది వంటల తయారీకి సంభందించి విషయ పరిజ్ఞానాన్ని అందిస్తూన్న భాగ స్వాములకు అధిక రాబడి ద్వారా మరింత ఆదాయం పొందేలా చూడడం. మూడవది ఆకర్షణీయమైన మెరుగైన ధరల ద్వారా వినియోగ దారులతో సత్సం బంధాలు కలిగి ఉండడం. ఇలా ఎందరో మహిళలకు ఆర్థిక స్వావలంబన కలిగిస్తుంది సోర్టిజి. దీనికి భారత దేశమంతటా వెయ్యిమంది పబ్లిషర్లు వారి ఆహార విషయ పరిజ్ఞానాన్ని ఆర్థిక స్వావలంబనగా మలచుకుంటున్నారు.
వినియోగదారులకు దగ్గరై...
సుర్భికి తాను స్టార్ట్ అప్ ప్రారంభించిన కొత్తలో మొదటి వినియోగదారున్ని ఒప్పించిన సంఘటన, టీం ఏర్పాటు చేయడానికి పడ్డ కష్టం తరచూ గుర్తుకు వస్తాయట. గూగుల్ పేలో ఈ యాప్ ప్రారం భిం చబడినప్పటి నుండి అంటే మే 2021 నుండి వంటకాల కోసం 3.6 లక్షలకు పైగా ప్రశ్నలు వచ్చాయి. సుమారు 2000 గంటల కంటే ఎక్కువ సమయం వంటకు సంబందించిన విషయాల కోసం ఈ ప్లాట్‌ఫారమ్ ను ఉపయోగించారు. అంటే ఇది వినియోగదారులకు ఎంత నమ్మకమైనదో, ఎంత దగ్గరైందో చెప్పేదేముంది. సార్టిజీ ద్వారా 'వంట చేసుకోవడం ఎలా'' అన్న ప్రశ్నకు సమాధానం దొరికిందని క్యాంపస్ ఫండ్ భాగస్వామి అనిరుధ్ తోష్ని వాల్ అన్న మాట అక్షర సత్యం.
మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం అవసరం
'మనం ఎదుగుతూ ఇతరులని ఎదగనిద్దాం.... నాకు నిరంతరం తోడుగా ఉంటూ ప్రోత్సహించిన వి హబ్‌కి కృతజ్ఞురాలిని. యువతను ఈవిధంగా ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారు' అంటే ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు. యువతులు వారి అభిరుచులకు అనుగుణంగా ఆత్మవిశ్వాసంతో, స్వశక్తితో ఎదగడానికి స్ఫూర్తిగా నిలబడాలని ఆమె నిర్ణయించు కున్నారు. తనకు కలిగిన ఇబ్బంది ఎవ్వరికీ కలగొద్దని చిన్న వయసులోనే పరిష్కారం ఆలోచించి సోర్టిజిని స్థాపించారు. అనతి కాలంలో ఎంతో మంది వినియోగదారులను సంపాదించుకున్నారు. మహిళా సాధికారతకు ఆర్థిక స్వాతంత్య్రం ఎంతో అవసరమని గుర్తించి ఎంతోమంది గృహిణులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఆసరాగా నిలిచిన సుర్బిగుహ జీవితం ఇప్పుడు ఎందరికో ఆదర్శం. వీరి యాప్ ఆండ్రాయిడ్ ఐఒయస్ వెర్షన్లలో లభిస్తున్నది. మీరు ఏదైనా వంట కొత్తగా ట్రై చేయాలని అనుకుంటున్నారా.. మరెందుకు ఆలస్యం వెంటనే www.sortizy .com యాప్‌ని డౌన్లోడ్ చేసుకోండి.
- ప్రమోద మునిమడుగు