Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యుక్త వయసులో పెండ్లి, పిల్లలు, ఇంటి బాధ్యతల కారణంగా ఉద్యోగాన్ని పక్కన పెట్టేస్తాం. ఇక పొదుపు ఎక్కడ వీలవుతుంది. కానీ మనకంటూ ప్రత్యేకంగా పొదుపు చాలా ముఖ్యం. అయితే చాలా మంది సగం వయసు అయిపోయింది ఇక పొదుపు ఏం చేస్తాం అనుకుంటారు. కానీ మీరు 40ల్లోకి వచ్చాక పొదుపు చేయాలనుకున్నా మంచి ఆలోచనే అంటున్నారు ఆర్థిక నిపుణులు. దానికి కొన్ని పద్ధతులు పాటించమంటున్నారు.
ఇప్పుడు పెట్టుబడి పెట్టేందుకు చాలానే అవకాశాలున్నాయి. మార్కెట్ గురించి తెలియజేసే వీడియోలు చూడండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. వాటి గురించి పూర్తి అవగాహన వచ్చాక కొద్ది మొత్తంలో మార్కెట్లో పెట్టుబడిగా పెట్టండి.
అత్యవసరానికి కొంత డబ్బును తీసి ప్రతి నెలా పక్కన పెట్టుకోండి. ఇది తప్పనిసరిగా చేయాల్సిన పొదుపు. ఎందుకంటే అత్యవసరంగా ఏమైనా అవసరమైతే అప్పటి కప్పుడు అప్పు చేయాల్సి వస్తుంది. అలా కాకుండా అందుబాటులో నగదు ఉంటే ఇబ్బంది ఉండదు.
ఇంతకు ముందు తీసుకున్న రుణాలు, క్రెడిట్‌కార్డు, లోన్లు తీర్చేయాలి. లేకపోతే మీరు పొదుపు మీద దృష్టి పెట్టలేరు. ఈ వయసులో పొదుపు చేయాలే కానీ అప్పులు కాదని గుర్తుంచుకోండి.
- జీవిత బీమా తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబీకులకు ఆసరాగా ఉంటుంది. అనవసరపు ఖర్చులను దాటవేయండి. అత్యవసరం అనుకున్న వాటికి మాత్రమే ఖర్చు చేయండి. వీకెండ్ ఏమైనా ప్లానింగ్ చేయాల్సి వస్తే నెల ప్రారంభంలోనే దీని గురించి ప్రణాళిక వేసుకుంటే సరి.