Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేసవి తాపాన్ని భరించలేక కూలర్లు, ఎసీలు ఉపయోగించడం సహజం. అయితే కూలర్లతో పోలిస్తే ఏసీని ఉపయోగించడం ఖర్చుతో కూడుకున్న పని. ఎందుకంటే ఇది ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. చాలా మంది రాత్రంతా ఏసీ పెట్టుకుని పడుకుంటారు. దీంతో కరెంటు బిల్లు పెరుగుతుంది. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే రోజంతా ఏసీ వేసినా కరెంటు బిల్లు తక్కువగా వస్తుంది. అవేంటో చూద్దాం...
ఏసీని ఎప్పుడూ తక్కువ టెంపరేచర్ వద్ద సెట్ చేయకూడదు. 16 లేదా 18 డిగ్రీల వద్ద ఉంచడం వల్ల మంచి కూలింగ్ వస్తుంది. కానీ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ప్రకారం మానవ శరీరం సౌకర్యవంతంగా ఉండే కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలు. కాబట్టి ఉష్ణోగ్రత 24 వద్ద ఉంచండి. దీనివల్ల విద్యుత్తు కూడా చాలా వరకు ఆదా అవుతుంది. ఏసీ ఉష్ణోగ్రతను ఎక్కువగా సెట్ చేయడం వల్ల 6 శాతం విద్యుత్ ఆదా అవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
- ఏసీ చాలా కాలం ఉపయోగించకుండా ఉండి సర్వీసింగ్ లేకుండా వాడితే కరెంటు బిల్లు పెరగవచ్చు. చాలా కాలం పాటు ఉపయోగించకుండా ఉండటం వల్ల ఏసీ దుమ్ము కణాలతో మూసుకుపోతుంది. దీనివల్ల ఏసీ మరింత ఎక్కువగా పనిచేయాల్సి వస్తోంది.
ు ఏసీ ఆన్ చేసే ముందు గది తలుపులు, కిటికీలను సరిగ్గా మూసేయండి. ఇది వేడి గాలి గదిలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. గదిలోని చల్లని గాలి బయటకు వెళ్లదు. లేకుంటే ఏసీ ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దాంతో కరెంటు బిల్లు కూడా పెరుగుతుంది.
- ఈ రోజుల్లో చాలా ఏసీలు స్లీప్ మోడ్ ఫీచర్‌తో వస్తున్నాయి. దీనిలో ఉష్ణోగ్రత, తేమ స్వయంచాలకంగా సర్దుబాటు చేయబడతాయి. దీని ద్వారా 36శాతం విద్యుత్ ఆదా అవుతుంది.
- కాసేపు ఏసీని వాడండి, ఆ తర్వాత ఫ్యాన్ వేసుకుంటే అది గదిలోని ప్రతి మూలకు ఏసీ గాలిని తీసుకువెళుతుంది. దాంతో గది మొత్తం చల్లగా అవుతుంది. దీంతో విద్యుత్‌ను ఆదా చేసుకోవచ్చు.