Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేసవి సెలవులొస్తున్నాయంటే తల్లిదండ్రులు ముందే భయపడిపోతుంటారు. పిల్లల అల్లరి అలా ఉంటుంది మరి. ఇలాంటప్పుడు వేసవి మొత్తానికి ఒక వ్యాపకం లాంటిది ఇచ్చి వారిని బిజీగా ఉంచండి. అప్పుడు ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉండొచ్చు..
- పరీక్షలు ముగియడంతోనే డ్యాన్స్ స్కూళ్లు తెరుచుకుంటాయి. నృత్యాన్ని పిల్లలు కూడా ఇష్టపడతారు. వీలైతే వారిని అందులో చేర్పించండి. ఇది చిన్నారులకి తగిన వ్యాయామం అందించడమే కాదు... వారి రోజునీ ఉల్లాసంగా గడిచి పోయేలా చేస్తుంది.
- పిల్లలకు మట్టిలో ఆడుకోవడం చాలా ఇష్టం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మట్టిలో ఆడుకుంటే అనారోగ్యానికి గురవుతారనే భయంతో మట్టిలో చేతులు పెట్టనివ్వం. అలాంటప్పుడు మార్కెట్లో రంగురంగుల క్లే కిట్లు దొరుకుతున్నాయి. వాటిని కొనిచ్చేయండి. బుద్ధిగా కూర్చొని వాటితో నచ్చిన బొమ్మలు చేసుకుంటుంటారు.
- గ్యాడ్జెట్స్‌తో ఆడుకోవటం, కంప్యూటర్‌పై పని చేయటాన్ని కొందరు పిల్లలు ఇష్టపడతారు. ఇలాంటి వారికి కంపోజింగ్, సిస్టమ్‌పై అవగాహన వచ్చేందుకు క్లాసులు చెప్పించండి. వారి సమయమూ సద్వినియోగ మవుతుంది. ఇలా నేర్చుకున్న కొత్త విషయాలు వారి భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తుంటాయి.