Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజురోజుకు ఎండ పెరిగిపోతుంది. ఉక్కపోత, చెమటతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇటువంటి సమయంలో ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే శరీరం డీ హైడ్రేట్ అయిపోయి ప్రాణాపాయం సంభవించే అవకాశం కూడా ఉంటుంది. బయట వాతావరణం వేడిగా ఉంటుంది కాబట్టి శరీరాన్ని లోపల చల్లగా ఉంచుకోవడం ముఖ్యం. అందుకోసం తగిన ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే నీరు ఎక్కువగా తీసుకోవాలి. ఈ నేపథ్యంలో వేసవిలో ఎక్కువగా తీసుకోవాల్సిన పానీయాలు, ఆహార పదార్థాలు ఏంటి? వాటిని ఎప్పుడు ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం...
కొబ్బరి నీరు : ఇది వేసవిలో అత్యంత ఆరోగ్యకరమైన పానీయం. ఇది అలసిపపోయిన శరీరాన్ని తిరిగి రిఫ్రెష్ చేయడానికి బాగా ఉపకరిస్తుంది. సహజ ఎలక్ట్రోలైట్లు, విటమిన్లు, మినరల్స్‌తో నిండి ఉన్న ఈ కొబ్బరి నీరు వేసవి వేడిని అధిగమించడంలో మీకు బాగా సహాయపడుతుంది. ఇది శరీరాన్ని రీహైడ్రేట్ చేస్తుంది. అనారోగ్యాల బారి నుంచి కాపాడుతుంది. అంతేకా జీర్ణక్రియను కూడా ప్రోత్సహిస్తుంది.
మజ్జిగ : ఇది తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. వాతావరణం కారణంగా ప్రేరేపించబడే గట్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మజ్జిగ అనేది శరీర సాధారణ ఉష్ణోగ్రతను పునరుద్ధరించే ప్రోబయోటిక్స్, విటమిన్లు ఖనిజాలతో సమృద్ధిగా ఉండే పానీయం. అంతేకాక ఇది మీ హైడ్రేషన్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
కీరదోస : వీటిలో నీటి కంటెంట్‌తో పాటు ఫైబర్, విటమిన్లు బీ1, బీ2, బీ3, బీ5, బీ6, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, జింక్‌లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడతాయి. అంతేకాక వేసవి నెలల్లో మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. కాబట్టి అలసిపోయినట్లు అనిపించినప్పుడల్లా మీ శక్తి స్థాయిలను తిరిగి పొందడానికి కీరదోసకాయలను తినొచ్చు.