Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెల్లువెత్తుతున్న ప్రముఖుల అభినందనలు
బీజింగ్ : చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఇతర దేశాల్లోని రాజకీయ పార్టీలు, నేతలు, ప్రముఖులు అభినందనలు తెలియచేస్తున్నారు. సీపీసీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి జీ జిన్‌పింగ్‌ను లేదా కమిటీని ఉద్దేశించి పలు సందేశాలు వెల్లువెత్తుతు న్నాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ గత శతాబ్ద కాలంలో సాధించిన అద్భుత విజయాలను వారు ప్రముఖంగా పేర్కొంటున్నారు. సీపీసీతో సహకా రాన్ని పెంపొందించుకోవాలని కోరుకుంటున్నారు. కొత్త శకానికి చైనా లక్షణాలతో కూడిన సోషలిజంపై జిన్‌పింగ్ భావనలు మొత్తంగా ప్రపంచ సోషలిస్టు ఉద్యమానికి, మార్క్సిజానికి కీలకమైన సేవలందించా యని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా పేర్కొన్నారు. మొజాంబియా అధ్యక్షుడు ఫిలిప్ యూసీ మాట్లాడుతూ, గత శతాబ్ద కాలంలో ప్రపంచ వ్యాప్తంగా శాంతి అభివృద్ధి, సంఘీభావం పెంపొం దించేందుకు చైనా విశేషంగా కృషి చేసిందన్నారు. రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెవ్ మాట్లా డుతూ, చైనా కమ్యూనిస్టు పార్టీ వందేండ్లు పూర్తి చేసుకుంటున్న ఈ శుభ తరుణంలో దారిద్య్రాన్ని సంపూర్ణంగా నిర్మూలించిందని ప్రశంసిం చారు. తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కొనడంలో తమ సామర్ధ్యా న్ని ప్రదర్శించిందన్నారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలెండ్ మాట్లాడుతూ చైనా దేశాన్ని బృహత్తరమైన రీతిలో పునరుద్ధరించాలన్న చైనా పాలకవర్గ నిబద్ధతను సమర్ధించారు. కజకస్తాన్ మొదటి అధ్యక్షుడు నూర్సుల్తాన్ నజర్బయేవ్ మాట్లాడుతూ, చైనాను అభివృద్ధి పథంలో నడిపిం చడంలో సీపీసీ పాత్ర ఎనలేనిదని అన్నారు. సెర్బి యా అధ్యక్షుడు అలెగ్జాండర్ వుసిక్ మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య విశ్వసనీయమైన స్నేహ సంబం ధం వుందన్నారు. జిన్‌పింగ్ నేతృత్వంలో కమ్యూనిస్టు పార్టీ మార్గదర్శకత్వంలో చైనా సర్వతోముఖాభివృద్ధిని సాధించగలదని ఆకాంక్ష వ్యక్తం చేశారు.