Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: అమెరికా సైనికుల ఉపసంహరణ గడువు దగ్గర పడుతున్న నైపథ్యంలో అఫ్ఘాన్ నాయకులు బైడెన్‌తో చర్చలకు రావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈ సెప్టెంబర్ పదకొండవ తేదీతో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చి 20 సంవత్సరాలు పూర్తి అవనుంది. ఆ రోజుతో అమెరికా సైనికులు అఫ్ఘాన్ భూభాగం నుంచి ఉపసంహరణ జరిగిపోవాలి. ఈ మధ్య కాలంలో తాలిబన్లు అఫ్ఘనిస్థాన్‌లోని దాదాపు 40 ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనాల పర్వం కొనసాగుతున్నది. దానితో ప్రజలలో ఒక అభద్రతా భావం నెలకొని ఉన్నది. అఫ్ఘాన్ ప్రభుత్వం కూడా తాలిబన్ల హింసాయుత పద్దతులతో ఇబ్బందులపాలౌతున్నది.