Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిటన్ ఆరోగ్య మంత్రి రాజీనామా
లండన్: కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా బ్రిటన్‌లో ఏకంగా ఆరోగ్య మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్న సమయంలో తన సీనియర్ సహయకురాలని ముద్దు పెట్టుకోవడమే మంత్రి చేసిన నేరంగా మారింది. ఈ సంఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో ఇంగ్లండ్ ఆరోగ్య మంత్రి, దేశంలో కరోనా నివారణ వ్యహారాలను పర్యవేక్షిస్తున్న మ్యాక్ హాంకాక్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే మంత్రి మ్యాక్ హాంకాక్ తన సీనియర్ సహయకురాలు గినా కొలాడంగెలోను ఆరోగ్య విభాగం కార్యాలయంలో ముద్దు పెట్టుకుంటున్న ఫోటోలను సన్ టెబ్లాయిడ్ వార్తా పత్రిక ప్రచురించింది. ఈ చిత్రాలను మే 6ను తీసినవిగా పేర్కొంది. అంటే లాక్డౌన్ నిబంధనలు సండలించానికి 11 రోజుల ముందువి. దీంతో సన్నిహిత కుటుంబ సభ్యులు కానివారితో భౌతిక దూరం పాటించాలనే నిబంధనను మంత్రి ఉల్లంఘించారని తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. దీంతో తన రాజీమానాను ప్రధాని బోరిస్ జాన్సన్‌కు అందచేశారు. హాంకాక్ రాజీనామాపై ప్రధాని బోరిస్ విచారం వ్యక్తం చేశారు. మహమ్మారిని నియంత్రించడంతోపాటు ఎన్నో ఘనతలు అతను సాధించాడని పేర్కొన్నారు. కాగా, బ్రిటన్ నూతన ఆరోగ్య మంత్రిగా సాజిద్ జావిద్‌ను నియమించనున్నారు. సాజిద్ గతంలో ఇంగ్లండ్ ట్రెజరీ చీఫ్‌గా పని చేశారు.