Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల వివాదంపై తిరిగి కసరత్తు ప్రారంభం
లిమా: పెరూ అధ్యక్ష ఎన్నికలపై నెలకొన్న గందరగోళంపై విచారణ చేస్తున్న ఎన్నికల జ్యూరీ కమిషన్ తన పనిని తిరిగి ప్రారంభించింది. నేషనల్ జ్యూరీ ఆఫ్ ఎలక్షన్(జెఎన్ఇ)లోని ఒక సభ్యుడు లూయిస్ అర్సే ఇటీవల తప్పుకోవడంతో విచారణ కొనసాగింపుపై అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. ఆయన స్థానంలో శనివారం విక్టర్ రౌల్ రోడ్రిగుజ్ న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఈనెల జరిగిన 6న జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేసి, విజేతను ప్రకటించే కసరత్తును జ్యూరీ తిరిగి ప్రారంభించింది.