Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్్: వాతావరణ సదస్సు కాప్ వచ్చే నవంబర్ 26 నుంచి గ్లాస్గోలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరగనున్నది దాని కోసం తయారు చేస్తున్న ముసాయిదా నివేదిక లీక్ అయింది. దాని ప్రకారం ప్రపంచానికి ముప్పు ముంచుకొస్తున్నదని తెలుస్తున్నది. భూగోళం నానాటికీ ఎలా నాశనమవుతున్నదో కండ్లకు కట్టినట్టు ఆ నివేదికలో ఉన్నది.నివేదిక ప్రకారం ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు నిర్ధిష్ట స్థాయికి చేరితే.. ఆ తర్వాత ఊహకందని ప్రమాదకర పరిణామలు చోటు చేసుకుంటాయని పేర్కొన్నది. ఆర్కెటిక్లో అతి శీతోష్టస్థితిలో ఉన్న మంచు గడ్డలు... వేడి ప్రభావంతో కరగడం మొదలైందంటే బారీ ఎత్తున మిథేన్ వాయువు వెలువడుతున్నది. ఆ శక్తివంతమైన వాయువు మరింత వేడిమికి కారణమవుతున్నదని నివేదిక అంచనా. పర్యావరణంగా సంభవించే పెనుమార్పుల తర్వాత జీవావరణ వ్యవస్థలోని ఇతరాలన్నీ దానికనుగుణంగా మారవచ్చుగానీ, మనిషికి మాత్రం అది అసాధ్యమనీ, అంతరించి పోవడం ఖాయమని హెచ్చరిక చేస్తున్నది.ఇప్పటికే అకాల వర్షాలు, వరదలు, వడగాలులు, కరువు కాటకాలు, భూకంపాలు తరుచుగా వేదిస్తున్నాయి. ధ్రువప్రాంతాల్లో మంచు పలకలు కరిగి విరుగుతున్నాయి. సమద్రాలు వేడెక్కుతున్నాయి. ఫలితంగా ప్రపంచ దేశాలన్నింటా ప్రతి ఏటా కోట్లాదిమంది జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రజల్ని చైతన్య వంతులను చేయాల్సి ఉన్నది.