Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమ్యూనిస్టు పార్టీ సభ్యులకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపు
- విశ్వాసపాత్రులైన సభ్యులకు పతకాల బహుకరణ
బీజింగ్ : చైనా కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో విశ్వాసపాత్రులైన పార్టీ సభ్యులకు అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మెడల్స్‌ను బహుకరి ంచారు. మార్క్సిజానికి కట్ట్టుబడి వుండాల్సిందిగా వారిని కోరారు. 40ఏండ్ల క్రితం ఆమోదించిన సంస్కరణల నేపథ్యంలో చైనా ఆర్థికంగా, రాజకీయంగా సంతరించుకున్న ప్రాధాన్యతను తెలియచేసేలా సోమవారం రాత్రి బీజింగ్ ఒలింపిక్ స్టేడియంలో బ్రహ్మాండమైన ఉత్సవం జరిగింది. మంగళవారం నాడు జరిగిన మరో కార్యక్రమంలో అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రసంగించారు. ఒకపక్క ప్రయివేటు పరిశ్రమలను ప్రారంభిస్తూ, మరోపక్క ప్రభుత్వ రంగ కంపెనీల విషయంలో ప్రాధాన్యతా విధానాలను అనుసరించామని జిన్‌పింగ్ పేర్కొన్నారు. చైనా లక్షణాలతో కూడిన మార్క్సిజం, సోషలిజం పట్ల పార్టీ కామ్రేడ్లందరూ సంపూర్ణ నిబద్ధతను పాటించాలని అవార్డు గ్రహీతలను ఉద్దేశించి ప్రసంగిస్తూ జిన్‌పింగ్ పేర్కొన్నారు. తియాన్మిన్ స్క్వేర్ వద్ద గురువారం ఈ ఉత్సవాలు ముగుస్తాయి. మావో జెడాంగ్ తర్వాత చైనాలో అత్యంత శక్తివంతమైన నేతగా జిన్‌పింగ్ గత 9ఏళ్ళ కాలంలో ఆవిర్భవించారు. మావో మాదిరిగానే జిన్‌పింగ్‌కు కూడా పదవీకాల పరిమితులు లేవు. 68ఏండ్ల వయస్సులో కూడా ఆయన ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఇంకా ఆయన కొన్నేళ్ళు అధికారంలో వుండే అవకాశం వుంది. దేశీయంగా ఎలాంటి రాజకీయ వ్యతిరేకత సంకేతాలు తలెత్తినా అణిచివేస్తూనే, అవినీతి వ్యతిరేక ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీకి ప్రస్తుతం దాదాపు 9కోట్ల 20లక్షల మంది సభ్యులున్నారు. అంటే దేశ జనాభాలో ఆరు శాతం పైగానే పార్టీ సభ్యులుగా వున్నారు. ప్రభుత్వ అధికారుల్లో, ప్రభుత్వ పరిశ్రమల నేతల్లో మెజారిటీ వ్యక్తులు పార్టీ సభ్యులే. అమెరికా, ఇతర దేశాల్లో కనిపించే పక్షపాత ధోరణులకు విరుద్ధంగా ఇక్కడ ఒక సామాజిక బంధం వుంటుంది. పాలక పార్టీ శత జయంతి ఉత్సవాల వేడుకలకు చైనా ప్రభుత్వ మీడియాలో విస్తృతంగా కవరేజీ ఇచ్చారు. దీంతో పాటు పశ్చిమ దేశాల్లో నెలకొన్న వర్ణ వివక్షత, అసమానతలు, ఇతర సామాజిక సమస్యలను కూడా భారీగా ప్రస్తావించారు. మానవ హక్కులకు సంబంధించి తమపై వస్తున్న తీవ్ర విమర్శల వెల్లువను తోసిపుచ్చేందుకు గల సామర్ధ్యం పట్ల నాయకత్వం విశ్వాసాన్ని ప్రతిబింబించినట్లు కనిపిస్తోంది. చైనా బృహత్తర పునరుజ్జీవనం దిశగా సాగే క్రమానికి పార్టీ సభ్యులు నాయత్వం వహించాలని జిన్‌పింగ్ కోరారు. సాంస్కృతిక, ఆర్థిక, సైనిక రంగాల్లో ప్రాంతీయ, అంతర్జాతీయ శక్తిగా శతాబ్దాల నాటి పాత్రను తిరిగి కైవసం చేసుకోవడమన్నది చైనా ఎజెండాగా వుందని ఆయన ప్రస్తావించారు.