Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సహచరఉద్యోగినితో సరసాలా..!
- యూకేలో ప్లకార్డులు,నిరసనలు,భారీప్రదర్శన
- బ్రిటన్ ఆరోగ్యమంత్రి రాజీనామా
ఇంగ్లాండ్ : కరోనాలో కంత్రీపనులేంటనీ..యూకేలో ప్లకార్డులు,నిరసనలు, భారీ ప్రదర్శనలు హౌరెత్తాయి. బ్రిటన్ ఆరోగ్య మంత్రి మాట్ హాన్కాక్ తన సహౌద్యోగితో ఎఫైర్ కలిగి ఉండటం,తరచూ ఆమెను కలవటం పై ఆగ్రహంవ్యక్తంచేశారు. దేశమంతా కోవిడ్..19 సంక్షోభంలో ఉంటే..దాన్ని నియంత్రించేదానిపై దృష్టిపెట్టకుండా ఇవేం పనులంటూ..యూకే వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. బ్రిటన్ ఆరోగ్యమంత్రి రాజీనామా చేయాల్సిందేనంటూ నినాదాలు చేశారు. మంత్రి దేశానికి ద్రోహం చేశారంటూ..అతడ్ని అరెస్టు చేయాల్సిందేనని ఆందోళనకారులు డిమాండ్చేశారు. కరోనా నిబంధనలు ఉన్నా...మహాప్రదర్శన నిర్వహించటంతో..బ్రిటన్ ఆరోగ్యమంత్రి రాజీనామా చేయకతప్పలేదు.
పోలీసులు పలువురు నిరసనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు.. పీఎం బోరిస్ జాన్సన్కు బ్రిటన్ ఆరోగ్యమంత్రి రాజీనామా లేఖనుపంపారు. 'మహమ్మారిలో ప్రజలు చేసిన త్యాగాలు చూస్తే, మనం వారితో ఏదైనా తప్పు చేస్తే, నిజాయితీగా ఉండటం మన బాధ్యత.' అని హాన్కాక్ పేర్కొన్నాడు. 42 ఏండ్ల హాన్కాక్ వివాహితుడే. ఆయనకు భార్య మార్తాతో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే అక్రమసంబంధాలే మంత్రి పదనినుంచి తొలగించేలా చేశాయి.హాన్కాక్ రాజీనామాను బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ అంగీకరించారు. ప్రతిస్పందనగా ఒక లేఖ కూడా పంపారు.- 'మీ సేవ గురించి మీరు చాలా గర్వపడాలి. మీ మద్దతుకు కృతజ్ఞతలు. ప్రజా సేవకు మీ సహకారం ముగియలేదని నేను నమ్ముతున్నాను.అని పేర్కొన్నారు.