Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదులక్షల మందిపై ప్రభావర : పరిశోధకులు
న్యూయార్క్ : గత నాలుగు దశాబ్దాలుగా అమెరికాలో పిల్లలలో ఊబకాయం(ఓబేసిటీ) గణనీయంగా పెరిగింది. 1980 లో, రెండు నుంచి 19 ఏండ్ల మధ్య వయస్సు గల పిల్లలు, యువతలో ఐదు శాతం మంది ఊబకాయులుగా ఉన్నారు. 2018 లో ఇది 19 శాతానికి పెరిగింది. అదనంగా16 శాతం మంది పిల్లలు అధిక బరువు సమస్యతో ఉన్నట్టు గుర్తించారు. కాగా కరోనా మహమ్మారి కారణంగా నిరవధిక పాఠశాల మూసివేత పిల్లలలో ఊబకాయం పెరిగే అవకాశం ఉన్నదని వైద్యనిపుణులు చేసిన పరిశోధనల్లో వెల్లడైంది. 2020 జూన్ లో ఊబకాయం అనే జర్నల్‌లోని పరిశోధనా పత్రం తయారుచేసింది. కొలంబియా విశ్వవిద్యాలయంలోని మెయిల్‌మన్ పబ్లిక్ హెల్త్ స్కూల్ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో కోవిడ్..19 కాలంలో ó పిల్లలలో ఊబకాయం సమస్యను పెంచుతున్నదని తేలింది. లావెక్కిన పిల్లల్లో టైప్ -2 డయాబెటిస్, అధిక రక్తపోటు, కాలేయ వ్యాధుల బారిన పడవచ్చు. మేనెలలో పీడియాట్రిక్స్ పత్రిక జరిపిన అధ్యయనంలో కూడా ఈ భయాలు సరైనవేనని గుర్తించింది.ఫిలడెల్ఫియాలోని చిల్డ్రన్స్ హాస్పిటల్ పరిశోధకులు ఐదులక్షల మంది పిల్లలపై అధ్యయనం చేశారు. రెండు నుంచి 17 ఏండ్ల వయస్సు కలిగి కౌమారదశలో ఉన్న వారి శరీర ద్రవ్యరాశి సూచికను కొలిచారు. 2019 జనవరి నుంచి 2020 డిసెంబర్ మధ్య పిల్లల ఊబకాయంపై పరిశోధనలు జరిపారు. మొత్తం మీద ఈ సమస్య రెండుశాతం పెరిగి 15.4 శాతానికి చేరినట్టు కనుగొన్నారు. వాస్తవానికి అంతకు ముందు జాతీయ స్థాయిలో ఊబకాయం పెరుగుదల ఒక శాతం లేదా అంతకంటే తక్కువగా ఉన్నది.బ్లాక్స్, లాటిన్, తక్కువ ఆదాయ కుటుంబాల పిల్లలలో ఈ సమస్య గణనీయమైన పెరుగుదల కనిపించింది. చిన్నతనంలోనే ఊబకాయం ఉన్న పిల్లలు పెద్దయ్యాక స్థూలకాయులుగానే ఉండిపోతున్నారు. ఇప్పటికే యూఎస్‌లో 40శాతం మందిపెద్దలు ఊబకాయం బారిన పడ్డారు. పిల్లల బరువు పెరగడానికి గల కారణాలను పరిశోధకులు విశ్లేషించారు.పిల్లలు ఇంట్లో కంటే పాఠశాలల్లో ఎక్కువ పోషకమైన, సమతుల్య ఆహారం పొందుతారు. వారు పాఠశాలలో కొన్ని సమయాల్లో తింటారు .తాగుతారు. రోజంతా తినడానికి వారికి స్నాక్స్ రావు. పాఠశాలల్లో కూడా శారీరక శ్రమలు జరుగుతాయి. మరోవైపు ఇండ్ల చుట్టూ సౌకర్యాలు లేకపోవడం, కరోనా భద్రతా కారణాల వల్ల పిల్లల కదలిక పరిమితమయ్యాయి.ఇలాంటి పలు కారణాలతో ఊబకాయ సమస్య పిల్లల్లో అధికమవుతున్నదని వైద్యవిశ్లేషకులు చెబుతున్నారు. చిన్నారుల్లో పెరుగుతున్న ఊబకాయ సమస్యను వ్యాయామాలు,సరైన ఆహారపు అలవాట్లతో నియంత్రించవచ్చని సూచిస్తున్నారు.
లాక్‌డౌన్‌తో స్థూలకాయులుగా మారటానికి నాలుగు కారణాలు
- ఫిజికల్ యాక్టివిటికి దూరం
- టీవీ,గ్యాడ్జెట్స్ వాడుతూ ఆహారపు అలవాట్లు
- ఎక్కువసేపు టీవీ,గ్యాడ్జెట్స్,మొబైల్స్ వాడటం
- పండ్లు,కూరగాయలకు దూరం..
- హైఫుడ్ క్యాలరీలు తినటానికి ఇష్టం..