Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చైనా : చైనాను మలే రియా రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటిం చింది. ఈ సందర్భంగా డబ్ల్యూ హెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధా నామ్ గేబ్రియస్.. ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మలేరియా రహిత దేశాల జాబితాలో చైనా 40వ దేశంగా నిలిచినట్లు వెల్లడించారు. మూడు సంవత్సరాలు వరుసగా మలేరియా కేసులు నమోదు కాకపోతే... ఆ దేశం డబ్ల్యూహెచ్ఓ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత డబ్ల్యూహెచ్ఓ పరిశోధన చేసి.. ఆ దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటిస్తుంది. 2018లో ఉజెకిస్తాన్, పారాగూయి, 2019 లో అల్జిరియా, అర్జెంటీనా, 2020లో ఈఐ సల్వాడర్ దేశాలు మలేరియా రహిత దేశాలుగా నిలిచాయి.
మలేరియా వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు చైనాకు 70 సంవత్సరాల కాలం పట్టింది. 1940లో చైనాలో 30 మిలియన్ల మలేరియా కేసులు నమోదయ్యేవి. కానీ గత నాలుగు సంవత్సరాల నుంచి చైనాలో ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాలేదు. చైనా తీసుకున్న చర్యల వల్ల మలేరియా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టి చివరకు నిర్మూలమయ్యాయి. దీంతో చైనాను మలేరియా రహిత దేశంగా డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది.