Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : జూన్ 5నాటికి చైనా కమ్యూనిస్టు పార్టీలో 9,51,48,000 మంది సభ్యులున్నారని సిపిసి కేంద్ర కమిటీ ఆర్గనైజేషన్ విభాగం బుధవారం ప్రకటించింది. 2019 చివరితో పోలిస్తే సభ్యత్వం 3.5శాతం పెరిగిందని పేర్కొంది. చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఏర్పడిన 1949తో పోలిస్తే దాదాపు 20రెట్లు పెరిగిందని ఆర్గనైజేషన్ విభాగం ఒక నివేదికలో పేర్కొంది. 1921లో చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడినపుడు 50మందికి పైగా సభ్యులున్నారు. ఈ ఏడాది మొదటి ఆర్ధ భాగంలోనే దాదాపు 20లక్షల మంది చేరారని ఆ నివేదిక పేర్కొంది. సభ్యుల సంఖ్య నిరంతరంగా పెరు గుతుండడం పార్టీ పటిష్టతను తెలియచేస్తుందని నివేదిక పేర్కొంది. ప్రాధ మిక స్థాయి పార్టీ సంఘాల సంఖ్య 1,95,000 నుండి 40.86లక్షలకు చేరింది, అంటే దాదాపు 24రెట్లు పెరిగిందని ఆ నివేదిక తెలిపింది.