Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : కోవిడ్ ఇన్ఫెక్షన్ను గుర్తించే మాస్కును పరిశోధకులు రూపొందించారు. మిట్, హార్వర్డ్ పరిశోధకులు ఒక కొత్త మాస్క్‌ను రూపొందించారు. ఇది ధరిస్తే వాళ్ళకి కోవిడ్ వుందో లేదో 90 నిముషాల్లోగా గుర్తించవచ్చు. నేచర్ బయో టెక్నాలజీ జర్నల్‌లో ఈ విషయాలు ప్రచురించారు. ఈ మాస్క్‌లో అతి చిన్నవైన, పునర్వినియోగపరచలేని (డిస్పోజబుల్) సెన్సార్లను పెట్టారు. ఈ మాస్క్‌ను ఇతర మాస్కుల్లో పెట్టవచ్చు. పైగా ఇతర వైరస్‌లను కూడా ఇది కనిపెట్టగలుగుతుంది. కేవలం ముఖానికి పెట్టుకునే మాస్కుల్లోనే కాదు, ల్యాబ్ కోట్లు వంటి దుస్తుల్లో కూడా ఈ సెన్సార్లను పొందుపరచవచ్చని పరిశోధకులు తెలిపారు. వివిధ రకాల వైరస్లు, ఇతర ముప్పుల నుండి హెల్త్ వర్కర్లను కాపాడేందుకు ఇదొక కొత్త మార్గాన్ని వేస్తోందని చెప్పారు.