Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీ-20 పిలుపు
బీజింగ్ : కోవిడ్ మహమ్మారిపై ఉమ్మడి పోరు సాగించాలని జీ-20 కూటమి పిలుపునిచ్చింది. వ్యాక్సిన్ ఎగుమతులపై ఆంక్షలు, అవసరానికి మించి వ్యాక్సిన్లను స్టాక్ ఉంచుకోవడం వంటి చర్యలను విడనాడాల్సిందిగా ధనిక దేశాలకు .జీ-20 విదేశాంగ మంత్రుల సమావేశం విజ్ఞప్తి చేసింది. ఈ సమావేశంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ, తమ దేశ ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తూనే, వందకుపైగా ఇతర దేశాలకు తాము 45 కోట్ల వ్యాక్సిన్లు అందించామని చెప్పారు. టీకాలు వేయడంలో గల అసమానతలను తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ ఏడాది జీ-20దేశాల సమావేశానికి ఇటలీ అధ్యక్షత వహించింది. కోవిడ్ కారణంగా పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య పెరిగిందనీ, మరో 10కోట్ల మందికి పైగా ఈ జాబితాలో చేరే అవకాశం వుందని జీ-20 సమావేశం ఆమోదించినన మాటెరా డిక్లరేషన్ పేర్కొంది. లక్షలాదిమంది ప్రజలు తమ ఉద్యోగాలు, ఆదాయ వనరులు కోల్పోవడంతో వారి ఆహార భద్రత దెబ్బతిన్నది. శాస్త్రీయ ప్రాతిపదికన కోవిడ్‌పై స్పందించాలని జీ-20 దేశాలను వాంగ్ యీ కోరారు. వ్యాక్సిన్లు, వ్యాధి నిర్ధారణ, చికిత్స వంటి రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయాలని కోరారు. జీ-20 దేశాలు సమస్య ఆధారంగా చర్యలు, విధానాలు అవలంబించాల్సిన అవసరాన్ని వాంగ్ నొక్కి చెప్పారు. అంతర్జాతీయ పాలనా వ్యవస్థను మరింత స్పందించే తీరుగా మలచుకోవాలని కోరారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పాత్రను బలోపేతం చేయాల్సిన అవసరం వుందన్నారు. అంతర్జాతీయ వ్యాధి నివారణ, నిరోధక వ్యవస్థను నిర్మించుకోవాలన్నారు.