Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డియోడీజెనిరో: కరోనా కల్లోలం రేపుతున్న బ్రెజిల్లో.. ప్రస్తుతం టీకాల వ్యవహారం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే భారత్కు చెందిన కరోనా టీకా కోవాక్సిన్-బ్రెజిల్ ఒప్పందంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు బోల్సోనారో ఇందులో జోక్యం చేసుకునీ, అక్రమాలకు పాల్పడ్డారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. దీనిపై పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు కొనసాగుతుండటం.. ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిపోయింది. ఇప్పుడు బ్రెజిల్ మరో టీకాకు సంబంధించి కూడా అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి స్థానిక మీడియాలో విస్తృత కథనాలు వెలువడుతున్నాయి. ఆస్ట్రాజెనికా సేకరణ విషయంలోనూ అవకతవకలు జరిగివుండవచ్చని పేర్కొంటున్నాయి.ఫోల్హా డీ ఎస్పాలో వార్తాపత్రిక కథనం ప్రకారం.. బోల్సోనారో సర్కారు ఆస్ట్రాజెనికా టీకాల విషయంలో అవకతవకలకు పాల్పడింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ లంచం డిమాండ్ చేసిందని పేర్కొంది. రికార్డో బారోస్ నియమించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ రాబర్టో ఫెరీరా డయాస్ ఆస్ట్రాజెనెకా మోతాదుకు 1 అమెరికన్ డాలర్ లంచం అడిగి ఉంటారని తెలిపింది. ఈ నివేదికలోని సమాచారం ప్రకారం దావతి మెడికల్ సప్లై ఆస్ట్రాజెనికా 400 మిలియన్ డోసులకు పోర్టుపోలియో కోరింది. ఒక్కో డోసు ప్రారంభ ఆఫర్ ధర రూ.3.5 డాలర్లుగా ఉంది. అయితే, అది క్రమంగా 15.5 డాలర్లకు పెరిగిందని పేర్కొంది. ఈ చర్చలు సెంట్రల్ రీజియన్లోని బ్రాసిల్లా షాపింగ్ మాల్లోని వాస్టో రెస్టారెంట్లో లంచం ముట్టినట్టు నివేదిక పేర్కొంది.