Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలు
న్యూయార్క్ : ఆరోగ్య సంరక్షణ రంగంలో కృత్రిమ మేథస్సు (ఏఐ), ఇతర కొత్త సాంకేతికతలను ఉపయోగించే సమయంలో తప్పనిసరిగా ఆచరించాల్సిన కీలకమైన మార్గదర్శక సూత్రాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) రూపొందించింది. 'ఆరోగ్యానికి కృత్రిమ మేథస్సు నిర్వహణ, నైతిక విలువలు' శీర్షికన రూపొందించిన నివేదికను విడుదలచేసింది. రెండేండ్ల కాలంలో 20మందికి పైగా అంతర్జాతీయ నిపుణులు దీనిని రూపొందించారు. కృత్రిమ మేథస్సు సాంకేతికతను ఉపయోగించే సమయంలో అనుసరించాల్సిన నైతిక పద్ధతులకు ప్రభుత్వాలకు, సాంకేతిక డెవలపర్లు, కంపెనీలు, సివిల్ సొసైటీ, అంతర ప్రభుత్వసంస్థలకు ఒక ప్రాతిపదికగా ఈ మార్గదర్శకాలు ఉపయోగపడతాయని డబ్ల్యుహెచ్ఓ పేర్కొంది. వైద్యపరమైన నిర్ణయాల్లో మానవ ప్రతిపత్తిని కాపాడేందుకు కృత్రిమ మేథస్సును ఉపయోగించాలన్నది మొదటి సూత్రం. గోప్యతను పరిరక్షించటం, విశ్వసనీయతను కల్పించటం, సరైన చట్టపరమైన రీతుల్లో డేటా పరిరక్షణకు అనుమతి పొందడం వంటివి ఇందులో వున్నాయి.