Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయాణీకులపై యూఏఈ ఆంక్షలు
అబుదాబీ : భారత్, పాక్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకతో పాటు పలుదేశాల పర్యటనపై తమ దేశ ప్రజలపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆంక్షలు విధించింది. కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో జులై 21 వరకు 14 దేశాల ప్రయాణీకులపై నిషేధం పొడిగించిన తర్వాత తాజాగా ఈ ప్రకటన చేసింది. ప్రస్తుతం ప్రయాణాల సమయం కావడంతో పౌరులు కోవిడ్-19కు సంబంధించిన అన్ని జాగ్రత్తలు, నివారణ చర్యలు పాటించాల్సి ఉందని విదేశాంగ శాఖ, జాతీయ అత్యవసర శాఖ, సంక్షోభం, విపత్తు నిర్వహణ అథారిటీ స్పష్టం చేశాయి. ఈ మేరకు యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అధారిటీ ఎయిర్‌మెన్ (నోటమ్) ఆదేశాలు జారీ చేసింది. లిబేరియా, నమీబియా, సియర్రా లియోన్, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండ, జాంబియా, వియత్నాం, భారత్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, నైజీరియా, దక్షిణాఫ్రికా దేశాలకు జులై 21 వరకు విమానాలు ఉండవని పేర్కొంది. కార్గో విమానాలు, చార్టర్ ఫ్లైట్స్, వాణిజ్యపరమైన ఫ్లైట్స్‌కు నిబంధనలు వర్తించవని తెలిపింది.