Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచం క్లిష్ట సమయంలో ఉంది : డబ్ల్యూహెచ్ఓ చీఫ్
ఐరాస : ప్రపంచం క్లిష్ట సమయంలో కొట్టుమిట్టాతుతన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ గెబ్రాయాసిస్ హెచ్చరించారు. ప్రస్తుతం ప్రపంచంలో డెల్టా వేరియంట్ లాంటి వ్యాప్తి చెందే వైరస్లు ఉన్నాయని అన్నారు. డెల్టా వేరియంట్ అభివృద్ధి చెందడంతో పాటు రూపాంతరం చెందుతుందని తెలిపారు. ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. తక్కువ టీకా కవరేజ్ ఉన్న దేశాల్లో.. కరోనా రోగులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రుల్లోని భయానక దృశ్యాలు పరిస్థితుల ఉధృతికి దారితీయవచ్చునని అన్నారు. డెల్టా లాంటి తీవ్రంగా వ్యాప్తి చెందే వేరియంట్లు...చాలా దేశాల్లో అధిక ప్రభావాన్ని చూపుతున్నాయనీ, ప్రపంచం మరింత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందని చెప్పారు. కరోనా కట్టడికిి నిరంతర పరిశీలన అవసరమనీ, ప్రజారోగ్య ప్రతిస్పందనను సరిగ్గా నిర్వహించాలని సూచించారు. ఈ వేరియంట్‌ను 98 దేశాల్లో గుర్తించారనీ, తక్కువ, ఎక్కువ వ్యాక్సినేషన్ కవరేజ్ అనే తేడా లేకుండా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ఈ కొత్త వైరస్‌ను తరిమికొట్టేందుకు రెండు మార్గాలున్నాయని చెప్పారు.