Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబూల్: అఫ్ఘనిస్తాన్‌లో అమెరికా అల్‌ఖైదాను అంతం చేసేందుకు 2001లో అడుగుపెట్టినప్పటి నుంచి కీలక వైమానిక కేంద్రంగా ఉన్న బాగ్రామ్‌ను అమెరికా, అఫ్ఘనిస్థాన్ అధికారులకు అప్పచెప్పింది. ఈ సందర్భంగా అమెరికా సైనిక కమాండర్ ఆసస్టిన్ అధ్యక్షుడు ఘనీని కలిసి చర్చలు జరిపి... వైమానిక స్థావరం ఖాళీ చేసిన తాము ఎల్లప్పుడు భద్రత సమస్యలు వస్తే అందుబాటులో ఉంటామని ప్రకటించారు.అమెరికా సైనికులు ఉపసంహరణ నేపథ్యం లో తాలిబన్లు కొన్ని పట్టణాలను లక్ష్యగా చేసుకుని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. స్థానికంగా దాడులకు పాల్పడుతున్నారు. దానితో ప్రజలు భయబ్రాంతులకు లోనౌతున్నారు. అఫ్ఘాన్ ప్రభుత్వం, సైనిక బలగాలు మరింత అప్రమత్తతతో ఉండాలని ప్రజలకు భద్రత కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.