Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 40 మంది మృతి
మనీలా : ఫిలిప్పిన్స్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మిలిటరీ మిమానం కూలిన ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫిలిప్పిన్స్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దక్షిణ ఫిలిప్పిన్స్లో ఆర్మీ సిబ్బందితో ప్రయాణిస్తున్న మిమానం జోలో ద్వీపంలో లాండింగ్ సమయంలో కుప్పకూలింది. దీంతో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదం కారణంగా ఇప్పటివరకు మొత్తం 40 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 45 మందిని అధికారులు కాపాడారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో పలువురు అక్కడిక్కడే చనిపోగా, మరికొంత మంది చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఇంకా పలువురి పరిస్థితి విషమంగా ఉంది.ఈ దుర్ఘటన గురించి మిలిటరీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ సిరిలిటో సోబెజన మాట్లాడుతూ.. మొత్తం 85 మందితో ప్రయాణిస్తున్న సీ-130 విమానం జోలో దీవిలో క్రష్ ల్యాండ్ అయింది. ఈ ప్రమాదం నుంచి 45 మందిని కాపాడామని వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదనీ, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువ మంది ఇటీవల మిలిటరీ శిక్షణలో పట్టభద్రులయ్యారు. ఉగ్రవాదంపై పోరాడే ఉమ్మడి టాస్క్ఫోర్స్లో వీరి సేవలను ఉపయోగించుకోనున్నారు.