Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబూల్: బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని అమెరికా నాటో సైన్యాలు ఖాళీ చేసి రెండో రోజులయ్యింది. తాలిబన్లు పాంజ్వాయి జిల్లాను స్వాధీనం చేసుకున్నారు. పాంజ్వాయి ఖందహార్ దక్షిణ ప్రాంతంలో ఉంటుంది. తాలిబన్లు పుట్టింది పాంజ్వాయిలోనే తాలిబన్ల కీలక నేతల్లో ఒక్కరైన హీబాతుల్లా అక్కడివారు. అమెరికా సైన్యం ఉపసంహరణ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలోని 421 జిల్లాలకు గాను మూడో వంతు జిల్లాలను తాలిబన్లు స్వాధీనం చేసుకుంటున్నారు. ఆ ప్రాంతంలోని ప్రజలు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకునొ సురక్షిత ప్రాంతాలకు తరలి పోతున్నారు. బైడెన్ సెప్టెంబర్ పదకొండులోపు అమెరికా సైన్యాలను పూర్తిగా ఉపసంహరిస్తామని ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. అప్ఘనిస్థాన్ మళ్ళీ తాలిబన్ల వంశం అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి.