Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మయన్మార్: మయన్మార్‌లో సైనిక పాలకుల కాల్పులలో మరో 25 మంది చనిపోయారు. గత ఫిబ్రవరిలో అంగ్‌సాన్ సూకీని గృహనిర్భందం చేసినప్పటి నుంచి సైనిక అధికారులు దేశ పరిపాలనను హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్నారు. దాన్ని సహించలేని సైనిక పాలకులు ప్రజలపై తీవ్ర హింసను ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే 850 మంది చంపబడ్డారు. ఆదివారం జరిగిన కాల్పుల్లో మరో 25 మంది చనిపోయారు. ఈ హింసాకాండ మయన్మార్ మధ్య ప్రాంతంలో జరిగింది. కాల్పులలో చనిపోయిన వారిలో అత్యధికులకు తలమీద గాయాలయ్యాయి. నిరసన కారులను అదుపు చేయడానికి మోకాలు కింద భాగంలో కాల్పులు జరపాలి. దానికి విరుద్ధంగా తలపై కాల్చడం సైనిక పాలకుల హింసా ప్రవృత్తిని తెలియజేస్తున్నది.సైనికులు గ్రామాలపై దాడులకు పూనుకుంటుంటే గ్రామస్తులు రక్షణ కోసం అడవులలో దాక్కుంటే అక్కడ కూడా వేటాడి చంపుతున్నారు. ప్రపంచం అంతా ఈ హింసను ఖండిస్తున్నా హింస మాత్రం ఆగడం లేదు. సూకీపై తప్పుడు కేసులు పెట్టి విచారణ జరుపుతున్నారు.