Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28 మంది గల్లంతు
మాస్కో: ప్రయాణికులతో వెళ్తున్న ఓ రష్యా విమానం సముద్రంలో కూలిపోయింది. రష్యా తూర్పు ప్రాంతం పెట్రోపవ్లోస్క్-కామ్ చట్స్కీ నుంచి పలానాకు బయల్దేరిన ఏఎన్-26 విమానానికి ల్యాండింగ్ సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో పలానాలో షెడ్యూల్ ప్రకారం ల్యాండింగ్ జరగలేదు. అప్రమత్తమైన అధికారులు, సైన్యం రంగంలోకి దిగి తప్పిపోయిన విమానం కోసం గాలించారు. చివరికి విమానం కాంచక్తా ద్వీపంలో సముద్రంలో కూలిపోయినట్టు గుర్తించారు. ఇందులో మొత్తం 28 మంది ఉండగా, వారిలో 22 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. వీరిలో చిన్నారులు సైతం ఉన్నట్టు సమాచారం. విమానం కూలిన చోటుకు సహాయ సిబ్బంది బయలుదేరి వెళ్లారని రష్యా ఎమర్జెఎన్సీ సర్వీసెస్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం తప్పిపోయిన వారికోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.