Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోర్ట్-అవు-ప్రిన్స్ : హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మోయిజ్ ఆయన నివాసంలోనే హత్యకు గురయ్యారని తాత్కాలిక ప్రధాని క్లాడ్ జోసెఫ్ తెలిపారు. గత రాత్రి మోయిజ్ ప్రైవేటు నివాసంపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, ఆయన్ని కాల్చి చంపారని జోసెఫ్ చెప్పారు. ఈ హత్యను జోసెఫ్ తీవ్రంగా ఖండించారు.. విద్వేషపూరితమైన, అమానవీయమైన, ఆటవిక చర్యగా ఆయన అభివర్ణించారు. దాడికి పాల్పడిన వారిలో కొంతమంది స్పానిష్ మాట్లాడుతున్నారని చెప్పారు. ఈ దాడిలో గాయపడిన అధ్యక్షుని భార్యను ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితి అదుపులోనే ఉందని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. పాలనను కొనసాగించడానికి, దేశాన్ని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అత్యంత నిరుపేద దేశమైన హైతీలో 2018లో జరగాల్సిన ఎన్నికలు జాప్యం కావడం, మోయిజ్ పదవీ కాలం ఎప్పుడు పూర్తయిందనే అంశంపై వివాదాల నేపథ్యంలో డిక్రీ ద్వారా మోయిజ్ పాలిస్తున్నారు. బుధవారం తెల్లవారు జామున ఈ వార్త తెలియడంతో వీధులన్నీ నిర్మాను ష్యంగా మారాయి.
దాడి జరిగిన తర్వాత రాజధాని అంతటా కాల్పుల శబ్దాలు వినిపించాయి. నేషనల్ ప్యాలెస్లో పోలీసు బలగాలను మోహరించామని జోసెఫ్ తెలిపారు. ఇతర ప్రాంతాలకు కూడా బలగాలను విస్తరిస్తామని చెప్పారు.