Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబూల్: ఆఫ్ఘాన్‌లో పెద్దఎత్తున హింస కొనసాగుతున్నది. ఈ సందర్భంలో కూడా ఆఫ్ఘాన్ ప్రభుత్వ ప్రతినిధులు తాలిబన్ల ప్రతినిధులు తెహరాన్లో సమావేశమయ్యారు. అమెరికా, నాటో సైన్యాలు మే ఒకటి నుంచి తాజా ఉపసంహరణ మొదలుపెట్టిననాటి నుంచి తాలిబాన్లు హింసాయుత దాడులు చేసి ఆఫ్ఘాన్లోని 407 జిల్లాలకు గాను ఇప్పటికే 195 జిల్లాలను స్వాధీనం చేసుకున్నారు. తాలిబన్లు ఒక ప్రాంతానికి చేరుకున్నట్టు తెలియగానే అక్కడి ప్రజలు కేరింతలు కొడుతూ వారిని స్వాగతిస్తున్న దృశ్యాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే 90 శాతం సైన్యం ఉపసంహరణ జరిగినట్టు అమెరికా సైనిక అధికారులు ప్రకటిస్తున్నారు. కొన్ని ప్రాంతాలను విడిచి వెళుతున్నప్పుడు కీలక భవనానలను అమెరికా సైన్యాలు ఎవ్వరికి అప్పచెప్పకుండా వెళ్ళిపోతున్నాయి. ఇలా కొనసాగితే ఏదో ఒక రోజు తాలిబాన్లు కాబూల్‌ను హింసాయుత పద్ధతిలో స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నదనే అభిప్రాయం వెలువడుతున్నది-