Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైతీ: దేశాధ్యక్షుడు జువెనెల్ మోయిజ్ హత్య ఘటనకు సంబంధించి 28 మందిని అరెస్టు చేశారు. వారిలో 26 మంది కొలంబియన్లు కాగా, మరో ఇద్దరు హైతీ సంతతికి చెందిన వారు. హత్య జరిగిన వెంటనే నలుగురు అగంతకులను చంపేశారు. హత్యలో పాల్గొన్నది విదేశీ అగంతకులని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలుస్తున్నది. వారిలో ఎక్కువ మంది మాజీ సైనికులుగా భావిస్తున్నారు. బుధవారం తెల్లవారు జామున దేశ రాజధాని ఫోర్ట్ ఫ్రిన్స్లోని మోయిజ్ వ్యక్తిగత నివాసంలోకి కొందరు సాయుధులు చొరబడి ఆయనను హత్య చేసిన సంగతి తెలిసిందే.