Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెరవేరిన తెలుగమ్మాయి శిరీష కల..
- 90 నిమిషాలలో తిరిగొచ్చిన వ్యోమనౌక
హ్యూస్టన్: వినువీధిలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కతమైంది. వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్షయాత్ర విజయవంతమైంది. ఆరుగురు సభ్యుల బ్రాన్సన్ బందం రోదసీ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని దాదాపు 90 నిమిషాలకు తిరిగివచ్చారు. రోదసిలోకి మన తెలుగు అమ్మాయి తొలిసారి ప్రవేశించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష ఈ ఘనత సాధించారు. ప్రముఖ అంతరిక్ష సంస్థ వర్జిన్ గెలాక్టిక్ ఆదివారం మానవ సహిత వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ-22ను వీఎంఎస్ ఈవ్ అనే ప్రత్యేక విమానం భూమి నుంచి 15,000 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లింది. అనంతరం అక్కడి నుంచి రాకెట్ ప్రజ్వలనంతో యూనిటీ-22 మరింత ఎత్తుకు వెళ్లింది. చివరి దశలో సొంత ప్రయాణాన్ని ప్రారంభించింది.
ఆరుగురిలో ఆమె!
కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్... అంతరిక్షంలోకి అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన భారతీయ వనితలు. ప్రస్తుతం శిరీష పేరు కూడా ఈ జాబితాలోకి చేరింది. ఈ యాత్ర విజయవంతం కావడంతో భారత్ నుంచి అంతరిక్షానికి వెళ్లిన నాలుగో వ్యోమగామిగా శిరీష చరిత్ర పుటలకు ఎక్కారు. ఇంతకుముందు రాకేశ్ శర్మ, కల్పనా చావ్లా, భారత-అమెరికన్ సునీతా విలియమ్స్ రోదసిలోకి వెళ్లి వచ్చారు.