Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హవానా: క్యూబాలో సోషలిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదివారం నుంచి నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. వీటికి ప్రతిపక్షాలు నాయకత్వం వహిస్తున్నా, అమెరికా సామ్రాజ్య వాదుల అండ ఉన్నది. అమెరికా ఒక వైపు క్యూబాను ఆర్థికంగా, వైద్యపరంగా ఆంక్షలు విధించి ఇబ్బందులు పెడుతూనే మరో వైపు ప్రజలను ప్రభుత్వంపైకి రెచ్చకొట్టుతున్నది. క్యూబా అధ్యక్షుడు నిరసన కారుల వద్దకు వెళ్ళి వాళ్లతో మాట్లాడి సముజాయించే ప్రయత్నం చేశారు. అటు తరువాత జాతిని ఉద్దేశించి ప్రజలకు వాస్తవాలను తెలియచేసి నిరసనకారుల తీరు తెన్నులను వివరించడంతో ప్రభుత్వ మద్దతు దారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు.క్యూబాలోని సోషలిస్టు ప్రభుత్వం కోవిడ్ నియంత్రణలో ఆదర్శంగా పని చేస్తున్నా ప్రతి పక్షాలు మరింత వేగంగా వ్యాక్సిన్లు ఇవ్వాలని కోరుతున్నారు. అందుకు అక్కడి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. దేశాధ్యక్షుడు కూడా అమెరికాను ప్రజలను రెచ్చగొట్టడం కాదు, మీరు ఆంక్షలు ఎత్తివేయండని తీవ్రంగా స్పందించారు.