Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హవానా: క్యూబాపై అమెరికా తీవ్ర ఆంక్షలు అమలు జరుపుతున్నది. క్యూబాకు వ్యాక్సిన్లు అందకుండా చేయాలనేది అమెరికా లక్ష్యం. దాని ప్రతిఘటిస్తూ క్యూబా పట్టుదలతో ఇప్పటికే ఐదు వ్యాక్సిన్లు తయారు చేసింది. ఆ వ్యాక్సిన్లకు విప్లవంలో పాల్గొన్న గెరిల్లాల పేర్లు పెట్టింది. అబిదలా, సోబెరానా 02, మాంబిసా లాంటి పేర్లు పెట్టింది.ఈ వ్యాక్సిన్లను 'బైయోక్యూబా ఫార్మా' అనే ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థ రూపొందించింది. రెండో అంశం క్యూబాకు అమెరికా ఒత్తిడి వలన వెంటి లేటర్స్ తయారి సంస్థలు పంపడానికి ముందుకు రాలేదు. దానితో క్యూబా వెంటిలేటర్స్‌ను స్వదేశంలో తయారు చేసుకుని తన ప్రజల ప్రాణాలను కాపాడుకుంటున్నది క్యూబాలో ఇప్పటికే 22 లక్షల వ్యాక్సిన్లు ఇచ్చారు. అందులో 12 లక్షల మందికి మొదటి డోస్, 7,70,390 మందికి రెండో డోస్ , 1,48,738 మందికి మూడో డోస్ కూడా పూర్తి చేశారు.అమెరికా ఆంక్షలను అదిగమిస్తూ క్యూబా తన ప్రజలకు వ్యాక్సిన్లు ఇవ్వడంతో ఆగకుండా, పేద దేశాలకు కూడా వ్యాక్సిన్లు పంపుతున్నది. తన అంతర్జాతీయ సంఘీభావం ఉండాలనే కర్తవ్యానికి కూడా కట్టుబడి ఉన్నది.